ఆర్య కథానాయకుడిగా తమిళ్ లో రూపందిన ‘మద్రాసి పట్టణం’ సినిమాను 1947 ఎ లవ్ స్టోరీ పేర తెలుగులోకి
అనువదించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ చిత్రానికి దర్శకుడు
ఎ.ఎల్.విజయ్, ఎ.జి.యస్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై సినిమాకు నిర్మాతలు కల్పతి, ఎస్.అగోరామ్,
కల్పతి ఎస్.గణేష్, కల్పతి ఎస్.సురేష్.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - తమిళ్ లో రూపొందిన మద్రాసి పట్టణం అనే సినిమాను తెలుగులోకి
అనువదించారు. ఆ కాలంలో మద్రాసు పట్నం ఎలా ఉండేదో దర్శకుడు రూపందించాడు. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు
మాత్రమే వస్తుంటాయి. ఈ సినిమా తమిళనాడులో విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా విజయవంతం
అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
ఎ.ఎల్.విజయ్ మాట్లాడుతూ - ఈ సినిమా క్లాసికల్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు మంచి సంగీతం కుదిరింది. ఈ సినిమాలో
నటించిన ఎమీ జాక్సన్ సినిమాల కోసమే పుట్టినట్టుగా పని చేస్తుంది.ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే
నమ్మకం ఉంది అన్నారు.
జి.వి.ప్రకాష్ మాట్లాడుతూ - ఈ సినిమా నా కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా ఇది అందమైన ప్రేమ కథతో రూపొందిన
సినిమా. ఈ సినిమా ఆడియో బ్లాక్ బస్టర్ అయ్యాయి అన్నారు.
రంగరాజన్ మాట్లాడుతూ - ఈ సినిమాను దర్శకుడు చాలా చక్కగా తీర్చి దిద్దాడు. అలాగే ప్రకాష్ మంచి సంగీతాన్ని
అందజేశారు. ఈ చిత్ర కథానాయిక విదేశాలనుండి వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకం
ఉంది అన్నారు.