Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘ఆలస్యం అమృతం’ పాటలు
నిఖిల్‌, మదాలసా శర్మ జంటగా నటించిన చిత్రం 'ఆలస్యం అమృతం'. చంద్రమహేష్‌ దర్శకత్వం వహించారు. డా|| డి.రామానాయుడు నిర్మాత. ఈ చిత్రంలోని గీతాల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. తొలి సీడీని వెంకటేష్‌ ఆవిష్కరించారు. రానా అందుకొన్నారు. అనంతరం వెంకటేష్‌ మాట్లాడుతూ ''పాటలన్నీ విన్నాను. కోటి మంచి సంగీతం అందించారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంద''న్నారు. రామానాయుడు ఈ చిత్రం గురించి చెబుతూ ''నవరస భరితమైన కథ ఇది. అయిదు పాటలూ ఆహ్లాదకరంగా ఉన్నాయి. కథకి బలాన్నిస్తాయి. నటీనటులందరూ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. ఈ చిత్ర ఫలితం కూడా అమృతంలానే ఉంటుందని భావిస్తున్నా'' అన్నారు. కె.వి. మహదేవన్‌ తరవాత సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలో ఎక్కువ చిత్రాలకు పనిచేసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు కోటి. ఈ కార్యక్రమంలో సుమంత్‌, కోడి రామకృష్ణ, పరుచూరి బ్రదర్స్‌, చంద్రసిద్ధార్థ్‌, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, ఏవీఎస్‌, శివారెడ్డి, అరవింద్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com