ఆడియో
 
 
 
 
‘అజ్ఞాతం’లో కళ్యాణి
కళ్యాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతం’. శ్రీధర్ దర్శకత్వంలో శ్రీ కమలాలయ ప్రొడక్షన్స్ పతాకంపై యస్‌వీయస్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. వాకాడ అప్పారావు ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రస్తుతం సమాజంలో స్ర్తీలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనే అంశాలను, వాటికి చక్కని పరిష్కారాలను చూపిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు ఇందులో వున్నాయి’’ అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రసన్నకుమార్, అమ్మిరాజు, తపన్, జయవాణి, సదివే దేవేంద్ర, ఆర్.కె.ప్రసాద్, యస్.యన్ రెడ్డి తదితరులు ఆడియోతో పాటు చిత్రం కూడా విజయం సాధించాలని కోరారు.