'పంజా' దర్శకుడు విష్ణువర్థన్ సోదరుడు కృష్ణ కథానాయకుడిగా నటించిన అనువాద చిత్రం 'అలీబాబా ఇంట్లో అందరూ దొంగలు'. జనని నాయిక. నీలన్ కె.శేఖర్ దర్శకుడు. వి.రమణ, జ్యోతిలాల్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాల్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు.తొలి సీడీని విష్ణువర్థన్ ఆవిష్కరించారు.
విష్ణువర్థన్ మాట్లాడుతూ ''నా తమ్ముడు ఇప్పటి వరకూ తమిళంలో మూడు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుందనే నమ్మకం ఉంది. విద్యాసాగర్ అందించిన బాణీలు అందరికీ నచ్చుతాయ''న్నారు.
వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. కార్యక్రమంలో నవదీప్, బిందుమాధవి తదితరులు పాల్గొన్నారు.