Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘అందరి బంధువయా’ పాటలు
యుటోపియా ఎంటర్ టైనర్స్, ఫిల్మోత్సవ్ సంస్థలు సంయుక్తంగా చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో నిర్మించిన ‘అందరి బంధువయా’ పాటలు ‘మధుర’ ఆడియో ద్వారా విడుదలయ్యాయి. పాటల క్యాసెట్లను శ్రీనువైట్ల విడుదలచేసి, తేజకు అందించారు. సీడిలను అల్లు అరవింద్ విడుదలచేసి డి.రామానాయుడుకు అందించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ- ‘స్వంత విధానం ఉన్న చక్కటి దర్శకుడు చంద్ర సిద్దార్థ’ అని ప్రశంసించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ- ‘చంద్ర సిద్దార్థ కమిటెడ్ దర్శకుడు. చిన్న దర్శకుల్లో పెద్ద దర్శకుడు. చిత్ర పరిశ్రమ మనుగడకు చిన్న చిత్రాలే ప్రధానం. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని’ అన్నారు. రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ- ‘తొలి చిత్రమే ఇంగ్లీషులో ‘ఇన్ స్ర్కూటబుల్ అమెరికన్స్’ పేరిట తీసిన నా మిత్రుడు చందు ‘ఆ నలుగురు’తో మంచి దర్శకుడిగా పేరు పొందారు. ఈ చిత్రం అతనికి మరింత మంచి పేరు తేవాలని’ అన్నారు. నరేష్ మాట్లాడుతూ- ‘ఇద్దరు ముగ్గురు మధ్య జరిగే అందమైన చిత్రం ఇది. ఇందులో నాపాత్ర నా కెరీర్లోనే బెస్ట్ అవుతుందని’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- ‘తను నమ్మినదాన్ని, అనుకున్నదాన్ని అందంగా తీసే దర్శకుడు చంద్ర సిద్దార్థ’ అని అన్నారు.

చంద్ర సిద్దార్థ మాట్లాడుతూ- ‘రమణిగారు చెప్పిన కథ వినగానే మంచి మనసున్న సినిమా చెయ్యొచ్చని అనుకున్నాను.అనూప్ మంచి పాటలు ఇచ్చాడు. చిన్ననాటి మిత్రుడు ఆర్కేతో, మంచి యూనిట్ తో ఈ చిత్రం సంతృప్తికరంగా చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయిక పద్మప్రియ, రాజా, ఆర్పీ పట్నాయక్, చైతన్యప్రసాద్, ఆర్కే, అనూప్, లగడపాటి శ్రీధర్, మధురా శ్రీధర్ రెడ్డి, జయకృష్ణ గుమ్మడి, దేవ్ కట్టా, కూచిపూడి వెంకట్, మాగంటి గోపీనాథ్, బలభద్రపాత్రుని రమణి పాల్గొన్నారు. సునయన, రఘు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com