ఆడియో
 
 
 
 
'బెజవాడ' పాటలు
వందిత కోనేరు సమర్పణలో శ్రేయా ప్రొడక్షన్స్ మరియు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో కిరణ్ కుమార్ కోనేరు నిర్మాతగా మరియు వివేక్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘బెజవాడ’. ఈరోజు హైదరాబాద్లోని బెజవాడ సినిమా ఆఫీసునందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ సాయంత్రం ఎఫ్ఎం స్టేషన్ ద్వారా జరుగనుందని తెలిపారు. ఈ చిత్రం వర్మ చిత్రాలన్నిటికన్నా కొంత వెరైటీగా వుంటుందని తెలిపారు.

డైరెక్టర్ వివేక్ కృష్ణ మాట్లాడుతూ- ‘బెజవాడ అనే ఊళ్ళో గలగలా పారే కృష్ణమ్మ వుంది. మండే దుర్గమ్మ వుంది. అలాగే ఈ బెజవాడలో ప్రశాంతత మరియు ఆవేశం రెండూ వున్నాయి. ఈ రెండు భావావేశాలను మనం ఈ చిత్రంలో చూడబోతున్నాము. బెజవాడలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన గొప్పవ్యక్తులు, అలాగే రౌడీయిజం నేపథ్యం కలిగినవారు కూడా వున్నారు. బెజవాడ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రంగా పేరొందినది కూడా. ఏ వ్యక్తినైనా మనం తీవ్రంగా డిస్టర్బ్ చేస్తే అతనిలోని అసమనం హద్దుల్ని దాటి బయటకు వస్తుంది. ఈ చిత్రంలో అలాంటి సన్నివేశాలు అనేకం చోటు చేసుకున్నాయి.

నాగచైతన్య యాంగ్రీ బాయ్ గా మరియు అన్ని కోణాల్లోనూ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఈ చిత్రం ఒకే కోణంలో వున్న చిత్రం కాదు. కమర్షియల్ మరియు మల్టీ యాంగిల్స్ ప్లానింగ్ ప్రపోర్షన్ ను కలిగి వున్న చిత్రం. నాగచైతన్య ఈ కథకి పర్ఫెక్ట్ గా మోల్డ్ అయ్యాడు.

ఈ సినిమా పాటల్లో కొత్తదనం చూపించాలని ఇందులోని 7 పాటలకు 5మంది మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకోవడం జరిగింది. అలాగే ఫైట్ మాస్టర్స్ని కూడా 5మందిని తీసుకోవడం జరిగింది. ప్రముఖ తమిళ నటుడు ప్రభు ఈ చిత్రంలో రెస్పెక్టబుల్ క్యారెక్టర్ ని పోషించారు. ఆయన నటించిన పాత తెలుగు చిత్రాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో ఆయన నటన కొంచెం డిఫరెంట్ గా వుంటుంది. ఈ సినిమా కోసం మా టీమ్ మొత్తం కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది.

కథ చెప్పగానే వర్మ ఓకె చెప్పారు. తరువాత చిత్ర నిర్మాణంలో మాకు పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఈ సినిమా నాకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తూ, ఈ నెల 3వ వారంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుందని విలేకరుల సమావేశంలో తెలిపారు.