ఆడియో
 
 
 
 
'గురువారం' పాటలు
‘‘నటుడు రామిరెడ్డితో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఆయన షిర్టీ సాయిబాబాగా నటించిన ‘గురువారం’ ఘనవిజయం సాధిస్తుంది’’ అని హీరో శ్రీహరి ఆకాంక్షించారు. నిత్యశ్రీ పతాకంపై సంగీత దర్శకుడు విఘ్న వినాయక స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘గురువారం’ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో శ్రీహరి ఆవిష్కరించారు.

విఘ్నవినాయక మాట్లాడుతూ -‘‘రామిరెడ్డిని బాబాగా నటించమంటే రెండు నెలలు తటపటాయించి, చివరకు ఒప్పుకున్నారు. విలన్‌తో దేవుడు సినిమా ఏంటని అందరూ కామెంట్ చేసినా నేను పట్టించుకోలేదు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అని తెలిపారు. సహ నిర్మాత వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ -‘‘రామిరెడ్డి ఈ రోజున మన మధ్య లేకపోయినా ఈ సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

పాటలు అద్భుతంగా వచ్చాయి. వచ్చే నెలలో విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా బండారు దత్తాత్రేయ, నట్టికుమార్, సునీల్‌కుమార్‌రెడ్డి, ఎం.ఎం.శ్రీలేఖ, హనుమంతరావు, విశ్వనాథమ్, రామోజి తదితరులు కూడా మాట్లాడారు.