సుభాష్ రాయల్, ఫరాఖాన్ జంటగా యమ్.శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇష్టపడితే’ సినిమా ఆడియో విడుదల
కార్యక్రమం ఫిలింఛాంబర్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో సత్యారెడ్డి, రమేష్ పుప్పాల, కృష్ణభగవాన్, బాలయ్య, యమ్.శ్రీనివాస్, రాజ్ కిరణ్, నామాలమూర్తి,
అమృతవల్లి, ఉమారెడ్డి, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో సత్యారెడ్డి ఆడియో సి.డి.ని విడుదల చేసి తొలి ప్రతిని రమేష్ పుప్పాలకు అందజేశారు.
సత్యారెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమాకు సహ నిర్మాత అయిన రాకూర్తి సూర్యప్రకాష్ నేను తీసిన 22 సినిమాలకు
నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అతను తన మిత్రులతో కలిసి నిర్మించిన ఈ సినిమా ఆడియో మంచి విజయాన్ని
సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
రమేష్ పుప్పాల మాట్లాడుతూ - ఈ చిత్ర నిర్మాతలు నాకు చాలా కాలంగా మంచి మిత్రులు. ఈ సినిమా పాటలు నేను
రెండు నెలలుగా వింటున్నాను. రాజ్ కిరణ్ మంచి సంగీతాన్ని సమకూర్చారు. నేను నిర్మించిన ‘మిరపకాయ్‘ సినిమా
పాటలు ఎంతటి విజయాన్ని సాధించాయో ఈ సినిమా పాటలు కూడా అంతటి విజయాన్ని సాధించాలని
కోరుకుంటున్నాను అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ సినిమా మంచి విజయాన్ని సాధించి నిర్మాతలకు మంచి లాభాలతో పాటు
సినిమాకు పని చేసిన వారికందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాము అన్నారు.
ఈ సినిమాలోని మిగిలిన పాత్రల్లో బాలయ్య, వేణుమాధవ్, వినోద్, రఘునాధరెడ్డి, గౌతంరాజు, సూర్య, చంద్రమౌళి,
పొట్టిరాంబాబు, తడివేలు, హేమ, రాగిని, దేవిశ్రీ, అమృతవల్లి, శృష్టి, ఉమారెడ్డి, సత్యశ్రీ, బండజ్యోతి తదితరులు నటించారు. ఈ
సినిమాకు సంగీతం : రాజ్ కిరణ్, మాటలు : సిద్దెల సురేష్, కెమెరా : ఇ.ఎస్.హెచ్.ప్రసాద్, కొరియోగ్రఫి : సామ్రాట్,
సహనిర్మాతలు : పోలిశిట్టి చంద్రశేఖర్, జగతా ధర్మారావు, రాకూర్తి సూర్యప్రకాష్, గొలుగూరి లక్ష్మీనారాయణరెడ్డి, సమర్పణ :
పడాల వెంకటరెడ్డి, నిర్మాతలు : పడాల వరలక్ష్మీ, పడాల శ్రీరామచంద్రారెడ్డి, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : యమ్.శ్రీనివాస్.