షిర్డి సాయి కంబైన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఇట్స్ మై లవ్ స్టోరీ'. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. అరవింద్ కృష్ణ, నిఖిత జంటగా నటించారు. మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.వి.కె.రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలోని పాటలు మధుర ద్వారా విడుదలయ్యాయి. తొలి సీడీని జయసుధ ఆవిష్కరించారు. లగడపాటి శ్రీధర్ అందుకున్నారు. జయసుధ మాట్లాడుతూ "ఆడియో బాగా ఉంది. సునీల్ మంచి సంగీతాన్నిచ్చారు. నాయకానాయికలు చూడచక్కగా ఉన్నారు'' అని అన్నారు. "సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది. అందరూ ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. సినిమా పరిశ్రమ బాగుండాలంటే ఇలాంటి మంచి సినిమాలు రావాలి. శ్రీధర్‌రెడ్డిని పరిశ్రమకు పరిచయం చేసినందుకు ఆనందంగా ఉంది. లవ్ స్టోరీకి వచ్చిన గ్యాప్‌ను ఇది పూర్తి చేస్తుందని నమ్ముతున్నాను'' అని చెప్పారు. "శ్రీధర్ గత చిత్రం నైజామ్ మేమే విడుదల చేశాం. 50 రోజులాడింది. ఆయన మీదున్న నమ్మకంతో ఈ చిత్రానికి టైయప్ అయ్యాం. భారీ విజయవంతం అవుతుందని నమ్ముతున్నాం'' అని వాసు తెలిపారు. యం.వి.కె.రెడ్డి చెబుతూ "అందరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అని చెప్పారు. సినిమా మంచి విజయం సాధించాలని సునీల్ కాశ్యప్, సిరాశ్రీ, అరవింద్ కృష్ణ, నిఖిత, కాశీ విశ్వనాథ్ అభిలషించారు. "నా అనుభవంలోకి వచ్చిన సంఘటనలతో ఈ కథను రాసుకున్నాను. పెళ్ళికి ముందే అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాల్సి వస్తే ఆ పరిస్థితులను ఎలా దాటుకుని ముందుకు వెళ్ళారు అనేది చూపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోనే మొత్తం సినిమా తీశాం. ఈ సినిమాకు మంచి జంట దొరికింది. సినిమా చాలా సహజంగా ఉంది. అంతా మన తెలుగు వారే ఇందులో నటించారు. ఈ చిత్ర నిర్మాత నాకు మెయిల్‌లో కలిశారు. ఆయన డబ్బు పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు వచ్చారు. అంత నమ్మకంగా తెరకెక్కించాం'' అని శ్రీధర్ అన్నారు.
|