ఆడియో
 
 
 
 
'జిల్‌' ఆడియో
మ్యూజిక్‌ అండ్‌ ముబైల్‌ డాట్‌కామ్‌ సమర్పణలో రాజుభూపతి రూపొందించిన 'జిల్‌' ఆల్బమ్‌ విడుదల కార్యక్రమం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ఆడియో సీడీని విడుదలచేసి తొలి ప్రతిని బోయపాటి శ్రీనుకు అందజేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ...'భూపతిరాజు నేను క్లాస్‌మేట్స్‌. ఇద్దరం స్పెషల్‌ తెలుగు చదువుకున్నాం. వాళ్ళబ్బాయి ఈ ఆడియోను చేయడం ఆనందంగా ఉంది. ఈ ఆల్బమ్‌కు జిల్‌ అని పేరు పెట్టారు. ఎంతో తపన ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు. వాళ్ళ నాన్న పట్టుదల వాళ్ళబ్బాయికి వచ్చింది. ఈ సందర్భంగా వారిని ఆశీర్వదిస్తున్నా'నని అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ...'ఆడియో, వీడియో చాలా బాగుంది. ఆరు పాటలు మెలోడియస్‌గా ఉన్నాయి. మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకముంది' అని అన్నారు. రాజుభూపతి మాట్లాడుతూ...'ఈ ఆల్బమ్‌ గతించిన నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నా. దీన్ని రూపొందించడానికి రెండేళ్ళు పట్టింది. దీన్ని అందరూ ఆదరిస్తారనే నమ్మకముంది' అని పేర్కొన్నారు.