బ్లూరే ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో పసుపులేటి వెంకటరామారావు నిర్మిస్తున్న 'కారాలు-మిరియాలు' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం
ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఆడియో సిడిని ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్‌ప్రసాద్ విడుదల చేసి తొలి సిడిని డా.రామానాయుడుకు అందచేశారు.
ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ 'కొత్త వాళ్లతో విదేశాల్లో సినిమా తీసి మన పదాలతో టైటిల్ పెట్టారు.వారు తీసుకున్న రిస్క్‌కు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను. కథ బాగుంటేనే ఏ సినిమా అయినా ఆడుతుంది. ఈ సినిమాకు కూడా మంచి కథ ఎన్నుకున్నారని అనుకుంటున్నాను. చిన్న సినిమాలు ఎక్కువగా రావాలని, విజయవంతం కావాలని ఆశిస్తున్నాను' అన్నారు.
రమేష్‌ప్రసాద్ మాట్లాడుతూ ' ఈతరం యువకులు సినిమాలు బాగా తీస్తున్నారు. వారిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఇలాంటి చిన్న సినిమాలను అంతా ప్రోత్సహించాలి' అన్నారు.
నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ 'అంతా కొత్తవారితో గతంలో తయారైన 'ఆనంద్' సినిమా హిట్ అయింది. అలాగే ఈ సినిమా కూడా
విజయవంతమవుతుందనే నమ్మకం కలుగుతోంది. సినిమా టైటిల్ బాగుంది. ప్రస్తుతం బాగున్న చిన్న సినిమాలను ఆదరిస్తున్నారు' అన్నారు.
హీరో నవకేష్ మాట్లాడుతూ 'గతంలో నేను టివిలో యాంకర్‌గా పనిచేశాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతకు నా కృతజ్ఞతలు.
ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రామారావు మాట్లాడుతూ 'ఓ కొత్త ఆలోచనతో ఈ ప్రేమకథాచిత్రాన్ని నిర్మించాం. విదేశాల్లో షూటింగ్ చేశాం. నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా సినిమా ఉంటుంది. ఈ ఆడియోను, సినిమాను ఆదిరిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్‌కుమార్ రెడ్డి, సంగీత దర్శకుడు చక్రి, గీత రచయిత రవీంద్ర పెండ్యాల, శివ చెన్ను తదితరులు పాల్గొన్నారు.