కళ్యాణ్ రామ్ ‘కత్తి’ ఈనెల 12న విడుదలవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్‌స పతాకంపై ఈ భారీ చిత్రాన్ని
కథానాయకుడు కళ్యాణ్‌రామే నిర్మిస్తున్నారు. మల్లికార్జున్ దర్శకుడు. మణిశర్మ బాణీలు
అందించారు.
కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఈ
సందర్భంగా దర్శక దిగ్గజం డాదాసరి, బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ తదితరుల సమక్షంలో ప్లాటినం
డిస్క్ వేడును ఘనంగా జరుపుకోనున్నాం. ఆడియో వేడుక లేకుండానే ‘సింహా’ఘనవిజయం
సాధించింది. అదే సెంటిమెంటుతో మా చిత్రానికి కూడా ఆడియో రిలీజ్ వేడుక లేకుండా నేరుగా ప్లాటినం
డిస్క్ పండుగను చేసేస్త్తున్నాం. ఆడియో ఇప్పటికే శ్రోతల్లో మంచి ఆదరణ పొందుతోంది.అభిమానులు
సైతం ‘సింహా’ తరహాలో ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నారు’ అన్నారు.
సనాఖాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్యామ్, శరణ్యామోహన్, కోట శ్రీనివాసరావు,
బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, అజయ్, రఘుబాబు, చంద్రమోహన్,
తెలంగాణ శకుంతల, సమీర్, మహర్షి రాఘవ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు
పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: ఎం.రత్నం, సినిమాటోగ్రఫీ: సర్వేష్
మురారి, కూర్పు: గౌతం రాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: సత్య, డాన్స్: ప్రేమ్ రక్షిత్,
అమ్మరాజశేఖర్, సుచిత్ర చంద్రబోస్, దినేశ్, కథనం-దర్శకత్వం: మల్లికార్జున్.