Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
26 ‘కింగ్ స్టన్’ ఆడియో
ప్రేమ్‌, అనూహ్యలను నాయకానాయికలుగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర మితుల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపెై బి.వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘26 కింగ్‌స్టన్‌’. ‘మతం ఉగ్రవాదంతో ముడిపడి ఉందా?’ అనే ప్రశ్నను ట్యాగ్‌లెైన్‌గా ఉంచారు. సతీష్‌ కుమార్‌ ఎం.వి దర్శకుడిగా పరిచయమవుతు న్నారు. ఈ చిత్రంలోని పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. పద్మనాభ్‌ ఈ చిత్రం ద్వారా సంగీత దర్వకుడిగా పరిచయమ వుతున్నారు. ఆడియో రిలీజ్‌ వేడుకలో రమేష్‌ ప్రసాద్‌, యువహీరో నిఖిల్‌, సంగీతదర్శకుడు రాజ్‌, మాడా వెంకటేశ్వరరావు, ప్రేమ్‌, అనూహ్య, పద్మనాబ్‌, టి, సతీష్‌కుమార్‌, బి.వెంకటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్‌, వర్మ, సిఐ నరసింహారెడ్డి, డాకె.సత్యనారాయణ, పిల్లి తిరుపతిరావు, గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ఆడియో సిడిని రమేష్‌ప్రసాద్‌ ఆవిష్కరించి తొలి ప్రతిని యువహీరో నిఖిల్‌కి అందించారు. చిత్ర సంగీత దర్శకుడు పద్మనాబ్‌ మాట్లాడు తూ ‘తొలి అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’ అన్నారు.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com