కృష్ణుడు, రితిక (పరిచయం) జంటగా శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకంపై కె. సురేశ్‌బాబు నిర్మిస్తున్న చిత్రం 'నాకూ ఓ లవరుంది' ఆడియో సీడీలు
ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. కె. రామ్‌వెంకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.ఎం. రాధాకృష్ణన్ సంగీత
దర్శకుడు. సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో 'వేదం' నిర్మాత ప్రసాద్ దేవినేని ఆడియో సీడీలను
ఆవిష్కరించి, తొలి కాపీని దర్శకుడు సుకుమార్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఆగస్టులో సినిమాని విడుదల చేస్తున్నాం. డైరెక్టర్ రామ్ వెంకి చాలా బాగా చిత్రాన్ని
రూపొందించారు. సంగీత పరంగా రాధాకృష్ణన్ విశ్వరూపం ఇందులో కనిపిస్తుంది. ఇది చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. టైటిల్‌కి మంచి రెస్పాన్స్
వచ్చింది'' అని చెప్పారు.
సంగీత దర్శకుడు రాధాకృష్ణన్ మాట్లాడుతూ "కొంత విరామంతో మంచి సినిమా చేసే అవకాశం కలిగింది. ఇందులో సందర్భానుసారం వచ్చే
ఐదు పాటలున్నాయి. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది'' అన్నారు. దర్శకుడు రామ్‌వెంకి మాట్లాడుతూ "రాధాకృష్ణన్ అందమైన మ్యూజిక్
ఆల్బమ్‌నిచ్చారు. కృష్ణుడు నిబద్ధతతో పనిచేసి, హీరోగా చాలా బాగా నటించాడు. తప్పకుండా అందర్నీ ఈ సినిమా వినోదింపజేస్తుంది'' అని
చెప్పారు.
కృష్ణుడు మాట్లాడుతూ "డైరెక్టర్ కథ చెప్పినప్పుడే బాగా ఎంజాయ్ చేశా. బ్రాహ్మణునిగా నటించా. మంచి టీమ్ వర్క్‌తో తయారైన సినిమా''
అన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ప్రసాద్ దేవినేని, సుకుమార్, టెన్నిస్ క్రీడాకారిణి, నిర్మాతల మండలి కార్యదర్శి, టి. ప్రసన్నకుమార్,
గుత్తా జ్వాల ఆకాంక్షించారు. హీరోయిన్ రితిక, నిర్మాత సోదరి మేనక, సతీమణి శ్వేత, ఎడిటర్ ఎం.ఆర్. వర్మ, నటి హేమ, నటులు వేణు,
ధనరాజ్, తాగుబోతు రమేశ్, గాయని సునీత, గేయ రచయిత లక్ష్మీభూపాల్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు.