ఆడియో
 
 
 
 
‘కుదిరితే కప్పు కాఫీ’... పాటలు విడుదల
వరుణ్‌సందేశ్‌ హీరోగా రూపొందిన 'కుదిరితే కప్పు కాఫీ' ఆడియో కార్యక్రమం జయభేరి క్లబ్‌లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా గేయ రచయిత సీతారామశాస్త్రి మాట్లాడుతూ...'సినిమా పరిశ్రమలో నిర్మాత ప్రాధాన్యత ఉన్నవాడు. దర్శకుడు రమణసాల్వను కథకుడిగా అభినందిస్తున్నాను. అతను గొప్ప కవి. మంచి భావుకుడు. సినిమాను అదే విధంగా తీర్చాడు. ఇటువంటి కథకు సంగీత దర్శకుని పనితనం చాలా అవసరం. మా అబ్బాయి యోగీశ్వర శర్మ పరిచయం అవుతున్నాడు. తనకు తానే అవకాశం తెచ్చుకున్నాడు. మా అబ్బాయిని ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'నని అన్నారు.

వరుణ్‌సందేశ్‌ మాట్లాడుతూ...'సినిమా ప్రారంభమే పెద్ద కథ. నాకు ప్రత్యేకమైన సినిమా. శాస్త్రిగారు కొత్తబంగారులోకం చిత్రానికి మంచి పాటలు రాశారు. ఈ సినిమాకూ రాశారు. వారి అబ్బాయి సంగీత దర్శకుడు అనగానే ఏదైతే ఊహించానో అదేవిధంగా వచ్చింది. పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా'నని అన్నారు.