Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘ఎల్.బి.డబ్ల్యూ’ ఆడియో
ప్రవీణ్‌ సత్తారు స్వీయరచన, దర్శకత్వంలో ఎ వర్కింగ్‌ డ్రీమ్స్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఎల్‌ బి డబ్ల్యూ’. ‘లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌’ అనేది ఉపశీర్షిక. సిద్ధార్థ్‌ జొన్నలగడ్డ, అభిజిత్‌, ఆసిఫ్‌తాజ్‌, రోహన్‌, చిన్మయి, నిశాంతి తదితరులు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. అనిల్‌.ఆర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఆడియో వేడుకలో తమ్మారెడ్డి భరద్వాజ, జ్వాలా గుత్తా (బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి), జయసుధ, దేవకట్టా, కృష్ణుడు, ప్రవీణ్‌ సత్తారు, అనిల్‌, సిద్ధార్థ్‌, చిన్మయి, నిశాంతి, రాంభట్ల.. తదితరులు పాల్గొన్నారు. ఆడియో తొలిసిడిని జయసుధ ఆవిష్కరించి సుధీష్‌ రాంభట్లకి అందించారు.

జయసుధ మాట్లాడుతూ ‘వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిది. ఇలాంటి సినిమాలు నేను నాయికగా చేసిన రోజుల్లో రావాలని కోరుకునేదాన్ని. అప్పుడా అవకాశం లేదు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలి’ అన్నారు.

సంగీతదర్శకుడు అనిల్‌.ఆర్‌ మాట్లాడుతూ ‘సినిమాలో మెలోడి సహా వైవిధ్యమైన ఏడు పాటలున్నాయి. సాహిత్యం శ్రోతల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. దర్శకుడు మాట్లా డుతూ ‘ప్రయోగాత్మకమైన మా తొలిప్రయ త్నాన్ని ఆశీర్వదించండి’ అన్నారు.

సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ‘పాటలు కథాగమనాన్ని అనుసరించే ఉంటాయి. ఎక్కడా అడ్డుపుల్లలా అనిపించవు’ అన్నారు.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com