సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి సమర్పకుడిగా మెగా సూపర్‌గుడ్ కంబైన్స్ పతాకంపై
రూపొందుతున్న చిత్రం ‘మంచివాడు’. తనీష్-భామ నాయకానాయికలు. ‘అందాలరాముడు’
ఫేం లక్ష్మీనారాయణ (దీప్తి) దర్శకుడు. ఎన్వీప్రసాద్, పరాస్‌జైన్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో
పాటల ఆవిష్కరణ వేడుక జరిగింది. ఆడియో వేడుకలో ఆర్.బి.చౌదరి, కె.విశ్వనాథ్, వెంకటేష్,
పరుచూరి వెంకటేశ్వరరావు, తనీష్, శిర్పి, నిఖిల్, వరుణ్‌సందేశ్, శర్వానంద్, కె.అచ్చిరెడ్డి,
వి.సముద్ర, ఆదిత్య ఉమేష్ గుప్త, భీమినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆడియో
తొలిసిడిని విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించి పద్మశ్రీ కె.విశ్వనాథ్‌కి అందించారు.
వెంకటేష్ మాట్లాడుతూ...'నేను హీరోగా నటించిన ఐదు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా తనీష్
చేశాడు. సూపర్‌గుడ్ అంటేనే మంచి చిత్రాలకు పేరు. రాజా, సంక్రాంతి, సూర్యవంశం తదితర
చిత్రాలు వారి బ్యానర్‌లో చేశాను. నా సొంత బ్యానర్‌గా ఫీలవుతాను. దర్శకుడు అందాల
రాముడు వంటి మంచి సినిమా తీసి వుంటాడని అనిపిస్తోంది. ఈ ప్రయత్నం విజయాన్ని
అందించాలి' అని అన్నారు.
సంగీత దర్శకుడు శిర్పి మాట్లాడుతూ...'తమిళంలో పలు చిత్రాలకు సంగీతం చేశాను.
ఆర్‌బి.చౌదరి నాకు గాడ్‌ఫాదర్. తెలుగులో రీఎంట్రీ అవుతున్నాను. ఈ ఏడాది అందరికీ సక్సెస్
రావాలి' అని చెప్పారు. నటుడు రఘుబాబు మాట్లాడుతూ... 'మంచి బ్యానర్, మంచి
దర్శకుడు...అసలు ఇక్కడున్నవారంతా మంచివారే.. వారంతా కలిసి తీసిన చిత్రమిది. డబ్బింగ్
చెబుతుండగానే పాటలన్నీ విన్నాను. హిలేరియస్ కామెడీ. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది'
అని అన్నారు.
చిత్రదర్శకుడు పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...'మొదటి సినిమా అందాలరాముడు.
ఘనవిజయం సాధించింది. అయినా గ్యాప్ తీసుకుని మళ్ళీ నా గాడ్‌ఫాదర్ అయిన,
ఆర్.బి.చౌదరి సినిమా చేశాను. ప్రేమకథ అయినా, ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంటుంది. సంగీతానికి
ప్రాధాన్యత ఉంది. శిర్పి చక్కగా చేశారు' అని అన్నారు.
ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ...'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈనెలలోనే విడుదల
చేయనున్నా'మని తెలిపారు.
ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్‌గుప్తా మాట్లాడుతూ...'పాటలు చాలా బాగున్నాయి.
సూపర్‌గుడ్ చిత్రాలన్నీ మేమే ఆడియో చేస్తున్నాం. శిర్పి చక్కటి సంగీతం అందించారు' అని
అన్నారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ...'రామానాయుడుగారిలా ఆర్.బి.చౌదరి మంచి స్క్రిప్ట్‌తో సినిమా
తీస్తారు. సంగీతపరంగా బాగుండేలా చూసుకుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే సినిమా
సక్సెస్‌కాగలదు. సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నా'నని అన్నారు.