ఆడియో
 
 
 
 
'నేను నాన్న అబద్ధం' పాటలు
నందు కథానాయకుడిగా గోవింద్ వరహా దర్శకుడిగా బాలప్రకాష్ నిర్మిస్తున్న ‘నేను నాన్న అబద్ధం’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సినీమాక్స్ లో జరిగింది.

ఈ కార్యక్రంమలో యండమూరి వీరేంద్రనాథ్, కరుణాకరన్, అచ్చిరెడ్డి, యన్.శంకర్, మధుర శ్రీధర్, గోవింద్ వరహా, బాలప్రకాష్, ప్రసన్న కుమార్, నందు, దివ్య, కృష్ణభగవాన్, పిల్లా ప్రసాద్, చిన్నా, చిన్నికృష్ణ, ఎడిటర్ మోహన్, శ్రీలేక నాగిరెడ్డి, అనితానాధ్ తదితరులు పాల్గొన్నారు.

యన్.శంకర్ ట్రైలర్స్ ను విడుదల చేయగా, ప్రసన్న కుమార్ ఆడియో సి.డి.ని విడుదల చేసి మొదటి ప్రతిని కె.అచ్చిరెడ్డికి అందజేశారు.

నందు మాట్లాడుతూ - ప్రోమోస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఆశిస్తున్నాను. దర్శకుడు మంచి చిత్రంగా తీర్చిదిద్దారు

దర్శకుడు గోద్ వరహా మాట్లాడుతూ - గతంలో నేను ఓ సినిమా చేశాను. అది అంత విజయం సాధించలేదు. ఆ సమయంలో బాధలో ఉన్నప్పుడు యస్వీ కృష్ణారెడ్డి గారు మంచి కథను తయారు చేసుకుని సినిమా తీయమని సూచించారు. నేను పెద్ద హీరోల గురించి తిరిగే వాడిని అలాంటి సమయంలో ఈ సూచన చేశారు. కథను తీసిన నిర్మాతలకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేశాను అని అనుకుంటున్నాను. సినిమాకు అన్నీ కుదిరాయి. నిర్మాతకు కృతజ్ఞతలు అన్నారు.