ఆడియో
 
 
 
 
ఆగస్టులో 'నేను నాన్న అబద్ధం'
కాస్మిక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'నేను నాన్న అబద్ధం'. నందు కథానాయకుడు. దివ్య నగేష్ నాయిక. ప్రకాష్ భరద్వాజ్ కీలక పాత్రధారి. వి.బాల ప్రకాష్ నిర్మిస్తున్నారు. గోవింద్ వరహ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం ఉదయం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

దర్శకుడు మాట్లాడుతూ "బ్లెండ్ కాఫీ షాప్ వాలీబాల్ కోర్టును మా టీమ్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఎడిటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఆగస్టు మొదటి వారంలో ఆడియో, మూడో వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది'' అని చెప్పారు. "ప్రేమ అనే భావన సర్వత్రా ఒకటే. ఆ భావన నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. కూల్‌గా సాగుతుంది'' అని ప్రకాష్ భరద్వాజ్ అన్నారు.

ఐదు పాటలుంటాయని చిన్నిచరణ్ చెప్పారు. ఈ సినిమా హీరోగా తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని నందు తెలిపారు. తొలి సినిమా ఇంత మంచి సినిమా చేయడం ఆనందంగా ఉందని దివ్య నగేష్ చెప్పారు. "చక్కటి సినిమా. పాటలు కూడా అందరికీ నచ్చుతాయి. మంచి నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారన్న నమ్మకం ఉంది'' అని నిర్మాత బాల అన్నారు.

మంచి పాత్రల్లో నటించామని తాగుబోతు రమేష్, ఫణి, ధన్‌రాజ్ చెప్పారు. కృష్ణుడు, ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణభగవాన్, పిళ్ళా ప్రసాద్, యండమూరి వీరేంద్రనాథ్, సోనాలి జోషి, అనిత ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ.యస్., కళ: చిన్నా, నృత్యాలు: స్వర్ణ, రాఖేష్, స్పెషల్ ఎఫెక్ట్స్: సాగర్.