Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘నేటి చరిత్ర’ పాటలు
హరీష్‌కల్యాణ్‌, అనక జంటగా నటించిన చిత్రం 'నేటి చరిత్ర'. జె.ఫణీంద్రకుమార్‌ నిర్మాత. స్వామి దర్శకుడు. సుందర్‌ సి.బాబు స్వరాలు సమకూర్చారు. హైదరాబాద్‌లో పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని దిల్‌రాజు ఆవిష్కరించారు. శ్రీనువైట్ల అందుకొన్నారు. క్యాసెట్‌ను డి.సురేష్‌బాబు విడుదల చేయగా, కె.సి.శేఖర్‌బాబు స్వీకరించారు. ''వైవిధ్యత ఉంటేనే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. స్వామి గతంలో రూపొందించిన 'మృగం' అందరినీ ఆకట్టుకొంది. 'నేటి చరిత్ర' కూడా అదే స్థాయిలో ఉంటుందన్న నమ్మకముంది. పాటలు, చిత్రీకరణలో కొత్తదనం కనిపిస్తోంద''న్నారు అతిథులు. దర్శకుడు మాట్లాడుతూ ''ఇది నాకు మూడో చిత్రం. గతంలో విడుదలైన నా రెండు చిత్రాలూ ఇక్కడ చక్కటి ఆదరణ పొందాయి. ఒక వైవిధ్యమైన అంశంతో తెరకెక్కించిన చిత్రం ఇది. నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్‌, సాగర్‌, భారతీబాబు, ప్రసన్నకుమార్‌, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. కల్పన ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com