Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' పాటలు
ఉదయ్ కిరణ్‌, శ్వేతబసుప్రసాద్‌ జంటగా రూపొందిన చిత్రం 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా'. శుభ సెల్వం దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిలింస్‌ పతాకంపై డి.కుమార్‌, ఈశ్వరప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ప్రసాద్‌ కోనేరు సంగీతం అందించిన ఈ ఆడియోని కామెడీ కింగ్‌ పద్మశ్రీ బ్రహ్మానందం సీడీని ఆవిష్కరించారు. తొలి సీడీ యువ హీరో తారకరత్న, హీరోయిన్‌ ప్రియమణి అందుకున్నారు. ట్రైలర్స్‌ని దర్శకులు వి.సాగర్‌, ప్రసన్నకుమార్‌ విడుదల చేశారు. ప్రముఖ ఆడియో సంస్ధ సుప్రీమ్‌ ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. బ్రహ్మానందం మాట్లాడుతూ...'టైటిల్‌ చాలా బాగుంది. ఇందులో చిన్న పాత్ర చేశాను. ఇండిస్టీకి వచ్చినప్పటి నుండి నేను ఇష్టపడే వ్యక్తుల్లో పల్లి కేశవరావు ఒకరు. ఇక ఉదయ్ కిరణ్‌ అల్టిమేట్‌ యాక్టర్‌. పాటలు బాగున్నాయి. ఇలాంటి సినిమాలు సక్సెస్‌ అయి ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి. అలాగే నిర్మాత చెప్పినట్టు పైరసీని విడనాడండి' అని అన్నారు.

తారకరత్న మాట్లాడుతూ...'సాంగ్స్‌ వండర్‌ఫుల్‌గా వున్నాయి. ఉదరుకి పెద్ద హిట్‌ కావాలి' అన్నారు. ప్రియమణి మాట్లాడుతూ...'పాటలు అద్భుతంగా వున్నాయి. ఉదరుకిరణ్‌, శ్వేతలు చాలా గ్లామర్‌గా వున్నారు. పెద్ద హిట్‌ కావాలి' అన్నారు. ఉదయ్ కిరణ్‌ మాట్లాడుతూ... 'ఈ సినిమా నాకు స్పెషల్‌ మూవీ అవుతుంది. దర్శకుడు శుభ సెల్వం మంచి ప్రేమకథతో కొత్తరకంగా చూపారు. ట్రీట్‌మెంట్‌తో మంచి అవుట్‌పుట్‌ తీశారు. ప్రదీప్‌ కోనేరు ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇక ఈ చిత్రానికి ఆయువుపట్టు నిర్మాత పల్లి కేశవరావు. మీ అందరి ఆశీస్సులు కావాలి' అన్నారు. శ్వేతబసుప్రసాద్‌ మాట్లాడుతూ...'పాటలు చాలా గ్రాండ్‌గా వున్నాయి. రొమాంటిక్‌ మూవీ ఇది. నేను నటించిన 'కొత్తబంగారులోకం' ఇప్పటికీ మాట్లాడుకుంటున్నట్లే ఈ చిత్రం కూడా హిట్‌ కావాలి' అన్నారు. దర్శకుడు శుభ సెల్వం మాట్లాడుతూ... 'నాకీ అవకాశమిచ్చిన నిర్మాత నా తండ్రిలాంటి వారు. ఆయనకి, ఉదయ్ కి కృతజ్ఞతలు. ప్రదీప్‌ మంచి సంగీతాన్నిచ్చారు' అన్నారు.

సంగీత దర్శకుడు ప్రదీప్‌ మాట్లాడుతూ... 'ఇది నా మొదటి సినిమా. పాటలు ఇంత బాగా రావడానికి దర్శక నిర్మాతలు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు. నా మొదటి సినిమా ఉదయ్ కిరణ్‌తో చేయడం చాలా సంతోషంగా వుంది' అన్నారు. నిర్మాత ఈశ్వరవరప్రసాద్‌ మాట్లాడుతూ... 'వెనుక గాడ్‌ఫాదర్‌లా పల్లి కేశవరావుగారు వుండి అన్నీ దగ్గరుండి నడిపించారు. ఈమధ్య కాలంలో చూడనటువంటి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని దర్శకుడు తీశాడు. ఉదరుకిరణ్‌ అభిమానులకు తగ్గట్లు వుంటుంది. దయచేసి పైరసీని అరికట్టండి' అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో జెమిని కిరణ్‌, దర్శకుడు శుభ సెల్వం, ప్రదీప్‌ కోనేరు, శాఖమూరి పాండురంగారావు, మోహన్‌ వడ్లపట్ల, పల్లి కేశవరావు, చిత్రం శ్రీను, ఉదయ్ కిరణ్‌ అభిమానులు పాల్గొన్నారు.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com