ప్రవాసాంధ్రురాలు సహజారావు తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ మనసా’. ‘నువ్విలా’ ఫేమ్ అజయ్
మంతెన, అపర్ణా బాజ్‌పాయ్, కెప్టెన్ తేజేష్ నాయుడు ఇందులో ముఖ్య తారలు. స్పైర్ ఫిలింస్ పతాకంపై ఎస్సార్
ఉమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో సీడీని మంగళవారం హైదరాబాద్‌లో డి.సురేష్‌బాబు
ఆవిష్కరించారు. ఓ మంచి ఆలోచనతో సహజారావు చేసిన ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని సురేష్‌బాబు
ఆకాంక్షించారు.
దర్శకురాలు మాట్లాడుతూ -‘‘పిల్లల్ని ప్రేమగా పెంచడమే కాదు. వారికి తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వాలి. యువత కూడా
ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు. ఈ నేపథ్యంలో సందేశాన్ని, వినోదాన్ని మిళితం చేసి ఓ అందమైన
ప్రేమకథగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. స్వరకల్పన కూడా నేనే చేశాను. పాటలు చాలా బాగా వచ్చాయి. త్వరలోనే
చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
ఈ సినిమాతో తనకు నటునిగా మంచి పేరు వస్తుందని హీరో అజయ్ చెప్పారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న
సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని పి. చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా డా.శ్రీధర్, కృష్ణవంశీ,
ప్రకాష్ భరద్వాజ్, బాబూరావు, రౌనత్, ఉమేష్, నిరంజన్ తదితరులు మాట్లాడారు.