ఆడియో
 
 
 
 
'పంజా' పాటలు
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'పంజా' ఆడియో విడుదలైంది. ఈ చిత్రంలో సారా జేన్ డయాస్, అంజలీ లావానియా నాయికలు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, దేవినేని వెంకట్, నగేష్ ముంత నిర్మాతలు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని సమకూర్చారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. తొలి సీడీని దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ అందుకున్నారు. 2జీబీ పాటల మెమరీ కార్డును పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఐఐటీలో టాపర్‌గా నిలిచిన పృథ్వీతేజకు పవన్‌కల్యాణ్ మెడల్‌ను అందజేశారు. నిర్మాత నీలిమ మాట్లాడుతూ "నేను పవన్‌కల్యాణ్ ఫ్యాన్‌ని. ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

దర్శకుడు చెబుతూ "అందరం కష్టపడి ఈ సినిమా చేశాం. సినిమా విడుదలయ్యాక మాట్లాడతాను'' అని అన్నారు. "విష్ణు నా ఫ్రెండ్. ఇక్కడ పుట్టాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే స్పీల్‌బర్గ్‌కు స్పాట్ పెట్టే వాడు'' అని రానా చెప్పారు. "వపర్‌స్టార్‌ని కలవడానికి నేను కోల్‌కతాకి వెళ్ళాను. కానీ ఆయన షూటింగ్ ఆరోజు లేదు. ఈ రోజు స్టేజి మీద కలవడం ఆనందంగా ఉంది. సినిమా టైటిల్ చిరిగిపోయింది. పవన్‌తో నేను సినిమా చేసే విషయం ఆయన చేతుల్లోనే ఉంది'' అని రాజమౌళి అన్నారు. పవన్ ప్రభంజనం కనిపిస్తుంది అని కీరవాణి అన్నారు. పవన్ నటన, డ్యాన్స్ అద్భుతంగా ఉంటాయని బ్రహ్మానందం చెప్పారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "నేను పరిశ్రమకి వచ్చి 15 ఏళ్ళు అయిందని ఓ ప్రోగ్రామ్ చేసి నాకు పంపితే తెలిసింది. విష్ణువర్ధన్ తపన ఉన్న దర్శకుడు. ఈయన్ని ఎస్.జె.సూర్య పరిచయం చేశారు. నాకున్న ఆలోచనలను చెబితే అద్భుతంగా కథను తీర్చిదిద్దారు. యువన్ మాతృమూర్తిని పోగొట్టుకున్నా నా మీద అభిమానంతో సంగీతం చేసి ఇచ్చారు. నాయికలు బాగా నటించారు. నిర్మాతలు నా మీద అభిమానం ఉన్నవారు'' అని చెప్పారు.

మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని నాయికలు అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, పరుచూరి వెంకటేశ్వరరావు, కీరవాణి, దానయ్య, గణేష్, యువన్‌శంకర్‌రాజా, వంశీ పైడిపలి,్ల అబ్బూరి రవి, ఆదిత్య దయానంద్ తదితరులు పాల్గొన్నారు. పాటలు ఆదిత్య ద్వారా విడుదలయ్యాయి.