ఆడియో
 
 
 
 
‘ప్లీజ్ వినద్దు’ అంటున్న అశ్విన్
ఐటి రంగం నుండి మరో సంగీత కెరటం ఎగిసి పడింది. ఆ కెరటం అందించిన ఆల్బమ్ పేరు ‘ప్లీజ్ వినద్దు’ వాటి వివరాల్లోకి వెళితే... మెల్టింగ్ పాయింట్ పతాకంపై అశ్విన్ పాలపర్థి ‘ప్లీజ్ వినద్దు’ అనే ఆల్బమ్ ను రూపొందించారు. ఈ ఆల్బమ్ లో తొమ్మిది పాటలున్నాయి.

తన ఆల్బమ్ గురించి అశ్విన్ పాలపర్థి మాట్లాడుతూ - యాప్ ల్యాబ్స్ లో వైస్ ప్రసిడెంట్ ని. వీకెండ్స్ లో మ్యూజిక్ చేస్తుంటాను. ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. నా మీద నాకు నమ్మకం ఎక్కువ.

ఇంతకు ముందు ‘నువ్వో కల’ అనే ఆల్బమ్ చేశాను. దాని ద్వారా వచ్చిన అనుభవంతో ఈ ఆల్బమ్ చేశాము. ఇందులో 9 పాటలున్నాయి. ప్రతి పాటలో ప్రేమ ఉంటుంది. అయితే ప్రేమ అనేది వివిధ అంశాల మీద ఉంటుంది. ఈ ఆల్బమ్ కు ఈ పేరు పెట్టడానికి కారణం ఆకర్షించడం కోసమే. నేను సంగీతం ఎక్కడా నేర్చుకోలేదు.

ఈ ఆల్బమ్ చేయడానికి ఒక ఏడాది పట్టింది. ఇప్పటికే రెండు వేల ఐదు వందల ఆల్బమ్స్ అమ్ముడయ్యాయి. చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. చిన్న తనం నుండి ఇళయరాజా పాటలు వినేవాడిని. సినిమా అవకాశం వచ్చినా చేయదలచుకోలేదు. బాగా ఇందులో ఆరితేరిన తరువాత సినిమా రంగ ప్రవేశం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నా మిత్రులకు వినిపించిన తరువాతనే దాన్ని ఎంచుంటాను. వాలంటైన్ డే సందర్భంగా ఈ ఆల్బమ్ విడుదల చేయడం జరిగింది.

ఇంతులో తొమ్మిది పాటలున్నాయి. అందులో నాలుగు బాగా వింటున్నారు. ప్లీజ్ వినద్దు వింటే మాత్రం ఖచ్చితంగా ఎడిక్ట్ అవుతారు అనేది నా అభిప్రాయం అన్నారు.