ఆడియో
 
 
 
 
'ప్రేమకావాలి' కి 3 ప్లాటినం డిస్క్
ఆది కథానాయకుడిగా విజయభాస్కర్ దర్శకుడిగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకం సమర్పణలో మాక్స్ ఇండియా ఫ్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించిన ‘ప్రేమకావాలి’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే కాగా ఈ సినిమా సంగీతం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ సాధించింది. ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆది, సాయికుమార్, అచ్చిరెడ్డి, సురేష్ రెడ్డి, విజయ్ భాస్కర్, బి.ఏ.రాజు, ఇషా చావ్లా, అంజనా సామ్య, అనూప్ రూబెన్స్, రామజోగయ్యశాస్త్రి, సాహితి, అనంత్ శ్రీరామ్, ప్రసాద్ వర్మ, దయానంద్ లు పాల్గొన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ - ప్రేమకావాలి విజయవంతంగా మూడవ వారంలోకి అడుగుపెట్టింది. విజయ్ భాస్కర్ సినిమాల్లో పాటలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. అలాగే ఈ చిత్రానికి అనూప్ చాలా మంచి సంగీతాన్ని ఇచ్చాడు. ఈ సినిమాకు పాటల కోసమే ప్రేక్షకులు వెలుతున్నారు. ఈ సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు.

అనూప్ మాట్లాడుతూ - ఈ ఫంక్షన్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అలాగే ఆదిత్య కంపెనీ వారికి, వెంకట్ గారికి అచ్చిరెడ్డి, సురేష్ రెడ్డిగార్లకు నా థాంక్స్ అన్నారు.

ఆది మాట్లాడుతూ - ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి సంగీతాన్ని ఇచ్చిన అనూప్ కు మిగిలిన వారందరికీ ఆడియెన్స్ కు నా కృతజ్ఞతలు అన్నారు.

విజయభాస్కర్ మాట్లాడుతూ - ఈ సినిమాకు రచయితలు ప్రాణం పెట్టి రాశారు. మంచి సాహిత్య విలువలతో రాశారు. రచయితల మార్క్ పాటల్లో కనిపించింది. చాలా అద్భుతంగా రాశారు. మంచి సంగీతం ఇచ్చిన అనూప్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా పాటల కోసం ఎక్కువ కష్టపడలేదు. అతను సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ చేశాడు. అలాగే ప్రసాద్ వర్మ కథకు తగ్గట్లుగా మాటలు రాశారు. అంజనా సౌమ్య చాలా బాగా పాడింది. ఇక నుండి ఇక్కడున్న సింగర్స్ తోనే పాడించాలని అనుకున్నాము. ఇంత మంచి పాటలు రావడానికి మంచి సినిమా తీసిన డాక్టర్ వెంకట్ గారు, అలాగే అచ్చిరెడ్డి, సురేష్ రెడ్డిలు తమ పూర్తి సహకారాన్ని అందించారు అన్నారు.

అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ఈ పాటలు ఇంత బాగా రావడానికి మ్యూజిక్ తో పాటు ఫోటోగ్రఫీ కూడా కారణమైంది. ఈ పాటలు చూసిన వారు మళ్ళీ మళ్ళీ రావడానికి పాటలను అందంగా తీయడమే ముఖ్య కారణం. ఈ సందర్భంగా ఛోటా కె.నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మనసంతా ముక్కలు చేసే అనే పాటను ఇంగ్లీషులో చేసి నెట్ లో పెట్టాలనే ఆలోచన మా డాక్టర్ వెకంట్ గారికి వచ్చింది. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అన్నారు.

ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి, ఇషా చావ్లా తదితరులు మాట్లాడుతూ సినిమా విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.