ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా పతాకంపై ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తోన్న చి్రతం
‘పూలరంగడు’. ‘అహనా పెళ్లంట’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన వీరభద్రమ్ ఈ
చిత్రానికి దర్శకత్వం వహించారు. కామెడీ కింగ్ సునీల్, ఇషా చావ్లా హీరోహీరోయిన్లు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ
హైదరాబాద్ లోని కత్రియా హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సురేష్ రెడ్డి, అచ్చిరెడ్డి, సుకుమార్, అనిల్
సుంకర, దేవ కట్ట, మంచు మనోజ్, అనూప్ రూబెన్స్, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఎం.ఎల్ కుమార్ చౌదరి, ఆది, చంద్రబోస్,
రామజోగయ్య శాస్త్రి, రమేష్ పుప్పాల తదితరులు పాల్గొన్నారు.
సుకుమార్ ఆడియోను ఆవిష్కరించారు. ఎస్.వి.కృష్ణారెడ్డి తొలి సిడీని అందుకున్నారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - పాటల రచయితలు ఐదుగురు ఒకే స్టేజి మీద కలవడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో నేనొక పాట రాశాను. రాసింది ఒకటూ అయినా మేలైన ఔట్ పుట్ ఇవ్వటానికి శాయశక్తులా
ప్రయత్నించాను. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
రమేష్ పుప్పాల మాట్లాడుతూ - ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో పూలరంగడుగా మా సునీల్ చాలా కష్టపడ్డాడు.
సాంగ్స్ విన్నాను. చూశాను. చాలా బావున్నాయి. డ్యాన్స్ కూడా బాగా చేశాడు. సునీల్ నటించిన ఈ సినిమా సక్సెస్
ను సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - నాకు ఈ అవకాశం ఇచ్చిన అచ్చిరెడ్డి గారికి, డాక్టర్ వెంకట్ గారికి ధన్యవాదాలు.
సునీల్ తో వర్క్ చేయటం ప్లెజెంట్ గా ఉంది అని అన్నారు.
ఎస్వీ. కృష్ణారెడ్డి మాట్లాడుతూ - కృషి, దీక్ష పట్టుదల ఉంటే ఎలాంటి విజయాన్ని అయినా సాధించగలము. ఈ
సినిమాలో సునీల్ అదే విధంగా కష్టపడ్డాడు. తప్పకుండా సక్సెస్ సాధిస్తాడు. అనూప్ సమకూర్చిన సంగీతం చాలా
బావుంది.. ఈ సినిమా మంచి హిట్ నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ - ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఒకే సినిమాతో పరిచయమైన నేను, సునీల్
సినిమా తీశామంటే ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి, అచ్చిరెడ్డి గారికి
ధన్యవాదాలు. చాలా క్వాలిటీగా సినిమాను చిత్రించాము. ఫిబ్రవరి 3న మీ ముందుకు ‘పూలరంగడు’ రాబోతుంది.
తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ - మ్యాక్స్ ఇండియా పొడక్షన్స్ లో ‘ప్రేమకావాలి’ సినిమా తీశాం. 100 రోజుల సినిమాగా
అలరించింది. అదే స్ఫూర్తిగా మళ్లీ ‘పూలరంగడు’ తీస్తున్నాం. ఈ సినిమా క్వాలిటీ కోసం సునీల్, వీరభద్రమ్ డే అండ్
నైట్ కష్టపడి పని చేశారు. అనూప్ అందించిన సంగీతం అద్భుతం. మా సినిమా మంచి సక్సెస్ కావాలని
కోరుకుంటున్నాను అని అన్నారు.
సునీల్ మాట్లాడుతూ - ఈ సినిమా అనుకున్న మొదటి రోజు ఈ సినిమా కలర్ ఫుల్ గా ఉండాలని హీరోగా నన్ను
ఎంపిక చేశారు. నేను బ్లాక్ కాబట్టి వైట్ కలర్ కోసం ఇషా చావ్లాను ఎంపిక చేశారు. మా ఇద్దరినీ కలిపి కలర్ ఫుల్ గా
ప్రసాద్ మురెళ్ల చిత్రించారు. ఈ సినిమాలో కొంచెం ఓర్పుగల వ్యక్తిగా నటించాను. ఈ సినిమా సక్సెస్ అయిందంటే ఆ
ఘనత మా టెక్నీషియన్స్ దే. ఇది యాక్షన్ మూవీ కాదు. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అండ్ కామెడీ మూవీ.
తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు
ఈ రోజు యోగి వేమన జయంతి సందర్భంగా యోగి వేమన కమిటీకు లక్ష రూపాయలు విరాశం అందజేశారు. ఈ
మొత్తాన్ని కమిటీ సభ్యుడైన కె.వివి రెడ్డి కు దేవ కట్ట అందజేశారు. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ స్థాపించినప్పటి
నుంచీ సమాజ సేవలో భాగంగా పలువురికి విరాళాలను అందజేస్తూ వచ్చారు. అలాగే ఈ వేడుక రోజు కూడా
వికలాంగులకు, ఒక పేద విద్యార్థికి, అనాధ బాలుడైన చంద్రశేఖర్ కు, సీనియర్ జర్నలిస్ట్ కు, సీనియర్ ఎగ్జిబిటర్ కు,
బ్రెయిన్ ట్యూమర్ పేషంట్ అయిన వీరమణికు సంస్థ తరపున ఒక్కొక్కరికీ 50 వేల రూపాయల చొప్పున సినీ
ప్రముఖుల చేత అందింపజేశారు.