ఆడియో
 
 
 
 
'రౌద్రం' పాటలు
జీవా, శ్రియ జంటగా నటించిన అనువాద చిత్రం 'రౌద్రం'. సి.జె.శోభ నిర్మాత. గోకుల్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాటల్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. తొలి సీడీని డి.రామానాయుడు ఆవిష్కరించారు. రోజా స్వీకరించారు.

జీవా మాట్లాడుతూ ''నేను నటించిన సినిమాలన్నీ తెలుగులో విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. 'రంగం' చిత్రానికి తమిళంలోకంటే పెద్ద విజయాన్ని అందించారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఇప్పుడు రెండు భాషల్ని దృష్టిలో పెట్టుకొని కథల్ని ఎంచుకొంటున్నాను. యాక్షన్‌, కుటుంబ భావోద్వేగాలు మిళితమైన చిత్రమిది. ప్రతి ఒక్కర్నీ అలరిస్తుంద''న్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''కళ్లతో భావాల్ని పలికిస్తూ నటించారు జీవా. నా తొలి చిత్రం తనతో చేయడం ఆనందంగా ఉంది. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం చక్కటి విజయాన్ని సాధించింది. అదే తరహాలో తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పిస్తుందనే నమ్మకముంది. ప్రకాష్‌ నిక్కీ సమకూర్చిన స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయ''న్నారు.

ఈ కార్యక్రమంలో రమేష్‌ ప్రసాద్‌, అచ్చిరెడ్డి, రాజశ్రీ సుధాకర్‌, వనమాలి, సముద్ర తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలయ్యాయి.