Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
'శంభో శివ శంభో' పాటలు
"తమిళంలో 'నాడోడిగల్‌' సినిమా చూశాను. హృదయానికి హత్తు కుంది. ఆ సినిమా ఆధారంగా వస్తున్న 'శంభో శివ శంభో' అంతకన్నా భారీ విజయం సాధించాలి' అని ఆకాం క్షించారు హీరో గోపీచంద్‌. రవితేజ, అల్లరినరేష్‌, శివబాలాజి, ప్రియమణి కాంబినేషన్‌లో పి.సముద్ర ఖణి దర్శకత్వంలో బెల్లం కొండ సురేష్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్న 'శంభో శివ శంభో' పాటల ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. గోపీచంద్‌ ఆడియోను ఆవిష్కరించి రవితేజ, అల్లరి నరేష్‌, శివబాలాజీలకు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గోపీచంద్‌ పైవిధంగా స్పందించారు. చాలా మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని, సముద్ర ఖణి ప్రతిభావంతుడని రవితేజ పేర్కొన్నారు. బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ -"రవితేజతో 'నా ఆటోగ్రాఫ్‌' సినిమా తీసినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను. 'శంభో శివ శంభో' రవితేజ శైలిలో ఉండే పక్కా కమర్షియల్‌ మూవీ. స్నేహం నేపథ్యంలో సినిమా ఉంటుంది. సుముద్ర ఖనితో మళ్లీ సినిమా చేయాలని ఉంది. ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం' అని తెలిపారు.

ఈ సినిమా గ్రాండ్‌ లెవెల్‌లో ఉంటుందని అల్లరి నరేష్‌, శివబాలాజి పేర్కొన్నారు. ఈ సినిమాలో బోలెడంత అల్లరి ఉందని, నిర్మాతకు డబ్బునీ, కీర్తిని అందిస్తుందని తనికెళ్ల భరణి చెప్పారు. ఇందులో తాను పరాటా శ్రీను పాత్ర పోషించానని సునీల్‌ అన్నారు. సంగీత దర్శకుడు సుందర్‌ సి.బాబు, నటుడు రావు రమేష్‌ ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధిస్తుందని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా సముద్ర ఖణి, అభినయ, సూర్యతేజ, సూర్య, పి.జి.ముత్తయ్య, జీవా, రవికుమార్‌, చిన్ని చరణ్‌ తదితరులు మాట్లాడారు.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com