‘‘మా కుటుంబం నుంచి మరో హీరో రావడం ఆనందంగా ఉంది. సుధీర్‌ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నా నమ్మకం.
ఒక రోజు సుధీర్ నాకు ఓ సీడీని ఇచ్చి చూడమన్నాడు. అందులో తను కంపోజ్ చేసిన డాన్స్, ఫైట్లు ఉన్నాయి.
చూసి షాక్ అయ్యాను. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా అద్భుతం అనిపించే రేంజ్‌లో చేశాడు. అప్పుడు అనిపించింది సుధీర్
మంచి హీరో అవుతాడని. ట్రైలర్స్, రెండు సాంగ్స్ చూశాను. తాతినేని ప్రకాశరావుగారి మనవడు సత్య సినిమా బాగా
తీసుంటాడు’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు.
కృష్ణ కుటుంబం రానున్న మరో నటుడు సుధీర్ హీరోగా తాతినేని సత్య దర్శకత్వంలో విక్రమ్‌రాజ్ నిర్మిస్తున్న చిత్రం
‘ఎస్‌ఎంఎస్’. సూపర్‌గుడ్ ఫిలింస్ సమర్పణలో ఈచిత్రం రూపొందుతోంది. సెల్వగణేశన్ స్వరపరిచిన ఈ చిత్రం
పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణ పై విధంగా స్పందించారు.
సీడీని మహేష్‌బాబు ఆవిష్కరించి, తొలి ప్రతిని వీవీవినాయక్‌కి అందించారు.
సుధీర్ మంచి హార్డ్ వర్కర్ అని, తన డెడికేషన్ తనకు బాగా న చ్చిందని, ఈ సినిమా తప్పక విజయం సాధించాలని
కోరుకుంటున్నట్లు మహేష్ చెప్పారు. ఇద్దరు సూపర్‌స్టార్ల మధ్య తన తొలి సినిమా ఆడియో విడుదల అవడం
సంతోషంగా ఉందని, హీరోగా తనకు అవకాశం ఇచ్చిన ఆర్‌బీచౌదరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సుధీర్
అన్నారు. శ్రీమతి విజయనిర్మల, రమేష్‌ప్రసాద్, పుల్లెల గోపీచంద్, ఆదిశేషగిరిరావు, సుకుమార్, కాశీవిశ్వనాథ్
తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.