అజిత్ కథానాయకుడిగా, సమీరారెడ్డి, భావన కథానాయికలుగా శరణ్ దర్శకత్వంలో రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని టాలీవుడ్ క్రియేషన్స్ పతాకంపై చినబాబు అరిగెల, సంపత్ కుమార్ తెలుగులో 'శూలం' అనే పేరుతో అనువదించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. జె.డి.చక్రవర్తి, ప్రసన్నకుమార్, శోభారాణి, ర్.పి.పట్నాయక్, శశాంక్ వెన్నెలకంటి తదితరులు ఒక్కో పాటను ఆవిష్కరించారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ- ‘నిర్మాతలు స్ట్రెయిట్ చిత్రాలు తీసేస్థాయికి ఎదగాలని’ అన్నారు.
శశాంక్ మాట్లాడుతూ- 'ఇది తమిళంలో అజిత్‌కు 50వ సినిమా. అందుకే ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబర్చాడు. స్క్రీన్‌ప్లే కూడా ఆయనే సమకూర్చారు. సినిమా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అజిత్ డ్యూయల్ రోల్ చేశారు. టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ పనిచేశారు. తమిళంలోలాగే తెలుగులోకూడా విజయవంత మవుతుంది' అని అన్నారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ- 'తమిళంలో నిర్మించిన ఈ బ్యానర్ ఎంతో పేరు తెచ్చుకుంది. వారు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో టాలీవుడ్ బ్యానర్ అనువదిస్తోంది. వీరు కూడా ఆ స్థాయి నిర్మాతలుగా ఎదగాలని కోరుకుంటున్నా'నని అన్నారు.
జెడి చక్రవర్తి మాట్లాడుతూ- 'ఇన్నేళ్ళ కెరీర్‌లో స్ట్రెయిట్ సినిమాకు డబ్బింగ్ సినిమాకు తేడా ఏమిటి అనేది తెలుసుకున్నా. డబ్బింగ్ సినిమాకు నిర్మాతకు తనకు కావల్సిన విధంగా చేసుకునే స్వేచ్చ ఉంటుంది. ఎవరికీ బాధ ఉండదు. అజిత్ నాకు మంచి మిత్రుడు. అతను ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. శశాంక్ మంచి మాటలు ఇచ్చాడు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా'నని అన్నారు.
చిన్నా మాట్లాడుతూ- ‘ఈ సినిమా తరువాత స్ట్రెయిట్ సినిమా చేయాలనుకుంటున్నాను’ అన్నారు.
శోభారాణి మాట్లాడుతూ- ‘సినిమా ట్రైలర్స్ పాటలు చాలా బాగున్నాయి. ఈ చిత్రం చిన్నాకు మంచి విజయాన్ని సాధించిపెట్టాలని కోరుకుంటున్నాను’ అన్నారు.