Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘సూపర్ కౌబాయ్’ పాటలు
రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'సూపర్‌ కౌబాయ్‌'. శింబుదేవన్‌ దర్శకత్వం వహించారు. పద్మప్రియ, లక్ష్మీరాయ్‌ కథానాయికలు. కల్పాతి ఎస్‌.అగోరం, ఎస్‌.రమేష్‌, ఎస్‌.గణేష్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని పాటల్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు.

తొలి సీడీని ప్రముఖ కథానాయకుడు నాగార్జున ఆవిష్కరించారు. రాఘవ లారెన్స్‌ అందుకున్నారు. నాగ్‌ మాట్లాడుతూ ''లారెన్స్‌ తాను సంపాదించిన సొమ్మును పేదలు, అనాథల కోసం ఖర్చుపెడతారు. ఆయనలో నాకు నచ్చిన లక్షణం అదే. 'మాస్‌', 'డాన్‌' చిత్రాల్లో అతను నా పాత్రను అనాథగానే మలిచాడు. ఇతరులకు సాయపడే లారెన్స్‌కి మంచి జరిగితే మరో పదిమందికి ఆ ఫలం అందుతుంది. చిన్నప్పుడు సూపర్‌ కౌబాయ్‌ చిత్రాలను చూసినట్టు గుర్తు. ఈ సినిమా కూడా అందరి మన్ననలను పొందాలని ఆకాంక్షిస్తున్నాన''ని అన్నారు.

''శింబుదేవన్‌ కథ చెప్పి, రూ.20 కోట్ల బడ్జెట్‌ అనగానే.. కథానాయకుడిని నేనే కదా? అనే సందేహం వచ్చింది. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వినోదం, నృత్యాలు, ఫైట్లు.. అన్నీ ఆకట్టుకుంటాయి. నేను ద్విపాత్రాభినయం చేశాన''ని చెప్పారు. ''జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీతం, అతడు కూర్చిన నేపథ్య సంగీతం, లొకేషన్లు, కథ.. ఈ సినిమాకు బలం. పాటలు తప్పక ప్రేక్షకులను చేరుతాయ''ని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎజీఎస్‌ కంపెనీ ప్రతినిధి రంగరాజన్‌, జీవీ ప్రకాష్‌కుమార్‌, శ్రీరామకృష్ణ, వనమాలి, మాలి, నాజర్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పాటలు సోనీ మ్యూజిక్‌ ద్వారా విడుదలయ్యాయి.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com