ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు సంతోష్‌శివన్ దర్శకత్వంలో ఫృద్విరాజ్, ప్రభుదేవా, ఆర్య, జెనీలియా, టబు,
నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘ఉరుమి’. ఎస్.వి.ఆర్.మీడియా పతాకంపై నిర్మాత
శోభారాణి ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. దీపక్‌దేవ్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగుపాటలు
ఆదిత్య ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. దర్శకుడు సముద్ర తొలిసీడీని ఆవిష్కరించగా, హీరో పృథ్వీరాజ్
సతీసమేతంగా అందుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియోవేడుకలో... సంతోష్‌శివన్, శోభారాణి, బి.జయ,
పృథ్వీరాజ్, సాజి గణేషన్, జి.సత్యనారాయణ, సంతోష్ శ్రీనివాస్, భీమినేని శ్రీనివాసరావు, రమేష్ పుప్పాల,
రమణ, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
సముద్ర మాట్లాడుతూ- ‘ఈ సినిమా పాటలు ట్రైలర్స్ చూశాము. ఈ చిత్ర దర్శకుడు మనదేశం గర్వించదగ్గ
గొప్ప ఛాయాగ్రహకుడు. ఆయన ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశారని తెలిసింది. ఒక మంచి టీమ్ శ్రమకు తగ్గ
ఫలితమే ఈ సినిమా. ఈ బేనర్ నుండి ఎన్నో మంచి చిత్రాలు తెలుగులోకి అనువదించబడ్డాయి’ అన్నారు.
పృథ్వీరాజ్ మాట్లాడుతూ- ‘దర్శకుని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది! ప్రపంచ యవనికపై మలయాళ సినిమా
జయకేతనం ఎగురవేయాలనే ఆలోచనతోనే చేశారీ సినిమా’ అన్నారు.
సంతోష్‌శివన్ మాట్లాడుతూ- ‘ఎక్కువ సినిమాలు స్వాతంత్య్ర పోరాటంపైనే తీశారు. అయితే మనదేశానికి
వాస్కోడిగామా ఎలా వచ్చాడనే కొత్త పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కించాం. వినోదం అలరిస్తుంది.
తెలుగుప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు.
శోభారాణి మాట్లాడుతూ- ‘హీరో ఆర్య చొరవతో ఈ సినిమా హక్కులు దక్కించుకోగలిగాను. ఉరుమి.. ఓ
వైవిధ్యమైన ఆయుధం. సినిమాలో ఓ పాత్ర అదే! కేరళలో చిన్న గ్రామాల్లో సైతం తెల్లవారిని ఎదురించిన
యోధులుండేవారట. నాటి తెల్లదొరల దురాగతాలు.. వాస్కోడిగామా క్రూరత్వం..తెరపై చూపించారు. సంతోష్ శివన్
మార్క్ సినిమా ఇది.
|