Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘వరుడు’ పాటలు
అల్లు అర్జున్‌ హీరోగా యూనివర్శల్‌ మీడియా పతాకంపై గుణశేఖర్‌ దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ‘వరుడు’ చిత్రం ఆడియో వేడుక పెళ్ళి వేడుకను తలపించే విధంగా అంగరంగ వైభవంగా రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని పాటల క్యాసెట్‌ను ప్రముఖ నిర్మాత యం.శ్యాంప్రసాద్‌రెడ్డి ఆవిష్కరిం చి తొలి క్యాసెట్‌ను మరో నిర్మాత డి.సురేష్‌బాబుకు అందజేసారు. పాటల సిడిని యస్‌.యస్‌.రాజమౌళి ఆవిష్కరించి తొలి సిడిని అల్లు అరవింద్‌కు అందజేసారు.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ ‘‘మా ఆహ్వానాన్ని మన్నించి మా ‘వరుడు’ ఆడియో వేడుకకు విచ్చేసిన సినీ ప్రముఖులకు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు’’ అన్నారు. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘గుణశేఖర్‌ చెప్పిన లైన్‌ విని వెంటనే ఓకే చేసాను. ఇది వంద శాతం గుణశేఖర్‌ చిత్రం. వేటూరి గారు అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఇంత అందంగా చూపించిన ఛాయాగ్రాహకుడు రాజశేర్‌కు చాలా కృతజ్ఞతలు. 50 రోజులపాటు మా పెళ్ళి వేడుకలో పాల్గొన్న నిజ జీవిత జంటలకు నా ధన్యవాదాలు’’ అన్నారు.

దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ ‘‘మంచి వివాహం ద్వారా మంచి దాంపత్యం, మంచి దాంపత్యం ద్వారా మంచి సంతానం, మంచి సంతానం ద్వారా మంచి సమాజం, అటువంటి మంచి సమాజమే ఈ ప్రపంచం. అంటే ఈ ప్రపంచానికి తొలి అడుగే ‘వివాహం’. అటువంటి వివాహ వేడుకే మా ‘వరుడు’ చిత్రం. తెలుగు చలన చిత్ర చరిత్రలో టాప్‌ ఫైవ్‌ చిత్రాల్లో ‘వరుడు’ ఒకటిగా నిలుస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ, బి.గోపాల్‌, కె.యస్‌.రామారావు, కె.యల్‌. నారాయణ, యం.యల్‌.కుమార్‌ చౌదరి, దిల్‌రాజు, బోగవల్లి ప్రసాద్‌, డా.కె.వెంకటేశ్వరరావు, శిరీష్‌, లక్ష్మణ్‌, తోట ప్రసాద్‌, అశోక్‌, నరేష్‌, కొండవలస, వేణుమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com