ఆది పినిశెట్టి, మీరా నందన్ ('జై బోలో తెలంగాణ' ఫేమ్) జంటగా నటించిన 'వస్తాద్' పాటలు ఆదిత్య మ్యూజిక్
ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. తమిళంలో విజయం సాధించిన 'అయ్యనార్' చిత్రానికి ఇది అనువాద
రూపం. ఎస్.ఎస్. రాజ్‌మిత్రన్ దర్శకుడు. కె.ఎస్.ఆర్. పిక్చర్స్ పతాకంపై కె. సాగర్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.
ఎస్.ఎస్. థమన్ సంగీత దర్శకుడు. సోమవారం ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో సాయిరాం
శంకర్ ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి ప్రతిని దర్శకులు వి. సముద్ర, సురేశ్‌వర్మకు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సాగర్ మాట్లాడుతూ "తన తమ్ముణ్ణి హత్య చేసిన దుర్మార్గుల్ని ఓ స్టూడెంట్ 'వస్తాద్'గా
మారి ఎలా తుదముట్టించాడన్నది ఈ చిత్ర కథాంశం. పగ, ప్రతీకారం నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో హీరో ఆది
అద్భుతంగా నటించాడు. యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్‌తో కూడిన ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్
అవుతాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈ నెల్లోనే చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు. ఆడియో,
సినిమా రెండూ విజయం సాధించాలని అతిథులుగా హాజరైన హీరో సాయిరాం శంకర్, దర్శకులు సముద్ర,
సురేశ్‌వర్మ, రచయిత స్వామి, నిర్మాతలు శాఖమూరి మల్లికార్జునరావు, సురేశ్ కొండేటి, ఫైనాన్షియర్ సూరిబాబు,
నటి వరాహి ఆకాంక్షించారు.
సంతానం, రామరాజు మరో రెండు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: సత్య, ఫైట్స్: సూపర్
సుబ్బరాయన్, లైన్ ప్రొడ్యూసర్: నయీమ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజ్‌మిత్రన్.