మాస్ మహారాజా రవితేజ హీరోగా 'రైడ్'వంటి సూపర్‌హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన రమేష్‌వర్మ దర్శకత్వంలో శాన్వి ప్రొడక్షన్స్
పతాకంపై ప్రముఖ నిర్మాత గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'వీర'. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్
జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత నిర్మాత గణేష్ ఇందుకూరి 'వీర' విశేషాలను తెలియజేస్తూ - ''హైదరాబాద్‌లో చాలా భారీ ఎత్తున క్లైమాక్స్ జరుగుతోంది. ఈ నెల 30 నుంచి రెండు పాటల కోసం యూరప్ వెళుతున్నాం. రవితేజ, కాజల్‌లపై ఈ రెండు పాటలు చిత్రీకరించడం జరుగుతుంది. మే మొదటివారంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ చేసి మే మూడోవారంలో సినిమా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు రమేష్‌వర్మ మాట్లాడుతూ - ''రవితేజ కెరీర్‌లోనే 'వీర' సెన్సేషనల్ ఫిల్మ్ అవుతుంది. హై టెక్నికల్ వేల్యూస్‌తో చాలా లావిష్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాత గణేష్ ఇందుకూరిగారు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా భారీగా నిర్మిస్తున్నారు''
అన్నారు.
మాస్ మహరాజా రవితేజ సరసన కాజల్, తాప్సీ కిక్ శ్యామ్, శ్రీదేవి, నాగబాబు, రోజా, కృష్ణుడు, బ్రహ్మానందం, ఆలీ,
వేణుమాధవ్, హేమ, దివ్యవాణి, ప్రదీప్ రావత్, సుప్రీత్, సుబ్బరాజు, అజరు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ:
ఛోటా కె.నాయుడు ఐఎస్‌ఓ, సంగీతం: థమన్ ఎస్., రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్:
గౌతంరాజు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, కళ: నారాయణరెడ్డి, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, వేణు పల్లి, నిర్మాత: గణేష్
ఇందుకూరి, కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: రమేష్‌వర్మ.