Bookmark and Share   Cinevinodam Subscribe
 
లారెన్స్ కోరిక తీరింది !

నృత్య దర్శకుడు, దర్శకుడు, నటుడు లారెన్స్కు రాఘవేంద్రస్వామి అంటే ఎంతో భక్తి. అట్టడుగు స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగిన లారెన్స్ రాఘవేంద్రస్వామికి పెద్ద గుడి కట్టాలని సంకల్పించి, ఆ భృహత్కార్యాన్ని ఈమధ్యనే పూర్తి చేశాడు. ‘నా జీవితకాలపు కోరిక తీరింది’ అంటూ ‘సూపర్ కౌబాయ్’ చిత్రం ఆడియో విడుదలకు వచ్చిన లారెన్స్ చెప్పారు. చెన్నైలోని అంబత్తూర్లో అయిదేళ్ళపాటు ఈ గుడి నిర్మాణం జరిగింది. దీనికి ‘రాఘవేంద్ర బృందావనం‘ అని పేరు పెట్టాం. మా అమ్మ ఆ గుడి నిర్వహణ వ్యవహారాలు చూసుకుంటోంది- అని లారెన్స్ చెప్పారు.

‘సూపర్ కౌబాయ్’లో కామెడీ
కౌబాయ్ సినిమాలంటే నాకు చిన్నప్పటినుండీ ఇష్టం. ‘గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’ నాకు బాగా నచ్చిన చిత్రం. అటువంటి కథతో సినిమా చేయడం అంటే ఆనందంగా అనిపించింది. శింబు దేవన్ స్ర్కిప్టు చాలా బాగుంది. దాన్ని తెరపైన మలిచిన విధానం మరీ బాగుంది. వెరైటీ ఎంటర్ టైనర్ గా వుండే ఈ చిత్రంలో యాక్షన్ తోపాటు కామెడీ కూడా వుంటుంది. వెస్ట్రన్ టైప్ లో ఫ్యాన్సీగా ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసేలా వుంటుంది. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఒక పాత్ర పవర్ ఫుల్ గా వుంటుంది. మరొకటి కామెడీగా వుంటుంది. కేరళ, సేలం, కడప దగ్గర కంది మొదలైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ చేశాం. దీనికోసం భారీసెట్ నిర్మించాం- అని చెప్పారు.

గుర్రం నడపడం, గన్ ఉపయోగించడం కోసం యూనిట్ లోని నటీనటులకు శిక్షణ నిర్వహించాం. ఇందులో డైరెక్ట్ ఫైట్ కన్నా గన్ ఫైట్స్ ఎక్కువగా వుంటాయి. ఇందులో నాతో ముగ్గురు హీరోయిన్లు వుంటారు. పద్మప్రియ, సంధ్య, లక్షీరాయ్ ఆ పాత్రలు పోషించారు. సాయికుమార్, నాజర్ ఇందులో కామెడీ విలన్లుగా నటించారు. మౌళి, మనోరమ, సెంథిల్ ఇతర పాత్రలు పోషించారు. జి.వి.ప్రకాష్ సంగీతం ఈ చిత్రంలో మరో ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. వెస్ట్రన్ విధానంలో ఇందులో ఆరు పాటలుంటాయి- అని చెప్పారు.

హీరోలకి స్క్రిప్టులు రెడీ
నేను గతంలో నటించిన ‘ముని’ చిత్రానికి రెండవభాగం ‘కాంచన’ పేరుతో చేస్తున్నాను. ఇందులో ‘కాంచన’గా ప్రత్యేక పాత్రలో అనూష్క నటిస్తోంది. హీరోయిన్ గా వేరే అమ్మాయి నటిస్తుంది. ఈ చిత్రంలో హీరోగా దర్శక, నిర్మాతగా నేనే చేస్తాను- ఈ చిత్రం తమిళ్ - తెలుగులో ఒకేసారి నిర్మిస్తాం- అని చెప్పారు.

తెలుగులో డైరెక్ట్ సినిమా కోసం స్క్రిప్టులు సిద్ధం చేసుకున్నాను. ప్రముఖ హీరోలు నాగార్జున, ప్రభాస్, అల్లు అర్జున్ వంటివారి కోసం స్క్రిప్టులు రెడీ అయ్యాయి. వారి అంగీకారంతో త్వరలో ప్రారంభిస్తాను- అని చెప్పారు లారెన్స్.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com