‘స్నేహగీతం’ చిత్రంతో అటు ప్రేక్షకులతోనూ, ఇటు విమర్శకులతోనూ ప్రశంసలు అందుకున్న ‘మధుర శ్రీధర్ రెడ్డి’ తాజాగా రూపొందిస్తున్న తదుపరి చిత్రం ‘ఇట్స్
మై లవ్ స్టోరీ’ అంతా కొత్త వారితో రూపొందించాలనే ఉద్దేశ్యంతో టాలెంట్ సెర్చ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆడిషన్స్ పూర్తి చేసుకొని సెట్స్ పైకి
వెళ్ళనున్న ఈ అందమైన ప్రేమకథా చిత్రాన్ని నెల్లూరు వాస్తవ్యులైన డా. మున్నా వెంకటకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని ‘బోట్స్వానా’ ప్రాంతంలో చిన్న
పిల్లల వైద్యులుగా ప్రసిద్ధిగాంచిన ఆయన సినిమాలపట్ల వున్న ప్యాషన్ తో మధుర శీధర్ రెడ్డితో వరుసగా మూడు చిత్రాలను రూపొందించడానికి నిర్ణయించుకున్న
సంగతి తెలిసిందే... ఆ దిశగా తన మొదటి చిత్రంగా ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ని నిర్మించనున్నారు. తర్వలో చిత్రీకరణ జరుపుకోనున్న సందర్భంగా ఇండియా విచ్చేసిన
ఆయనతో ‘మధుర శ్రీధర్ రెడ్డి’ కార్యాలయంలో సినీవినోదం ముచ్చటించింది.
ముందుగా మీ గురించి వివరిస్తారా?
ఖచ్చితంగా... మాది నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు వద్ద చిన్న గ్రామం. చాలా కాలం క్రితమే చెన్నైలో సెటిలయ్యాము. ఎమ్.బి.బి.ఎస్ చేశాను. చదువంతా నెల్లూరు
తిరుపతిలలో జరిగింది. గత 20 సంవత్సరాల నుండి దక్షిణాఫ్రికాలోని ‘బోట్స్వానా’లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ గా వున్నాను. అక్కడే చిన్న పిల్లల ఆసుపత్రితో బాటు పలు
బిజినెస్ లు నిర్వహిస్తున్నాను.
సాధారణంగనా డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని చాలా మంది అంటుంటారు... మరి మీరు డాక్టర్ అయ్యుండి ఒక నిర్మాత అయ్యారు. ఎలా
ఫీల్ అవుతున్నారు?
ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్... నేను కావాలని ఇండస్ట్రీలోకి రాలేదు. టైమ్ కలిసొచ్చి వచ్చేశాను. కానీ సినిమాలన్నా, నాటకాలన్నా చాలా అభిమానం నాకు.
ఎందుకంటే నేను చదువుకునే రోజుల నుండే నాటకాలు వేసేవాడిని. నాతో బాటు మిత్రడు డా. శివప్రసాద్ రెడ్డి (నటుడు) చుదువుకునేవాడు, ఖైదీ నిర్మాత తిరుపతిరెడ్డి
నాకన్నా 2 సంవత్సరాలు సీనియర్ మేమంగా కలిసి ఆ రోజుల్లో నాటకాలు వేసేవాళ్ళం. నేను ఎక్కువగా ‘ధుర్యోధన’ పాత్ర వేసేవాడిని.
20 సంవత్సరాలుగా సౌత్ ఆఫ్రికాలో వైద్యులుగా ఉన్న వారు షడెన్ గా చిత్ర నిర్మాణానికి రావడానికి కారణం?
కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. నా కొలీగ్ ద్వారా మధుర శ్రీధర్ దర్శకత్వం వహించిన ‘స్నేహగీతం’ చిత్రాన్ని నెట్ లో చూశాను. ఎందుకో చూడగానే నాకు ఆ
చిత్రం విపరీతంగా నచ్చింది. చాలా సింపుల్ గా యూత్ మనోభావాలను, వారు ఎన్నుకున్న లక్ష్యాలను వారు అధిగమించే తీరు బాగా ఆకట్టుకుంది. అప్పుడే ఒకవేళ
చిత్ర నిర్మాణంలోకి ఎంటరైతే ‘మధుర’ శ్రీధర్ ద్వారా రావాలనుకున్నాను.
తెలుగు సినిమాలను రెగ్యులర్ గా చూస్తుంటారా?
నేను సాత్ ఆఫ్రికా వెళ్ళక ముందు అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం చూశాను. తర్వాత ‘స్నేహగీతం’. అప్పుడప్పుడూ టివి, ఇంటర్నెట్ లో చూస్తుంటాను కానీ,
సినిమా మొత్తం చూడను. ఎక్కువగా సినిమా విడుదలయ్యాక సినిమా గురించి నెటిజన్స్ గానే కామెంట్స్, రివ్యూస్ ఎక్కువగా చదువుతాను. ఎందుకంటే ఒక
సినిమా ఎలా ఉందనేది వారి అభిప్రాయం అందులో రాస్తారు. అఫ్ కోర్స్ నేను కూడా రాస్తాను.
ఒక చిత్రానికే దర్శకత్వం వహించిన ‘మధుర శ్రీధర్ రెడ్డి’కి అవకాశం ఇవ్వడానికి గల కారణం?
సినిమా తీయాలని నిర్ణయించుకున్నాక ‘శ్రీధర్’ని కలిశాను. అతనికి మంచి ఎడ్యుకేషన్ తో బాటు మంచి హ్యూమన్ బీయింగ్ వున్న వ్యక్తి. ముఖ్యంగా అతనిలోకి
సింప్లిసిటీ బాగా నచ్చింది. అతని యాటిట్యూడ్, వే ఆఫ్ థింకింగ్, అతని నడవడి, చాలా బాగా నచ్చాయి. ఒక దర్శకుడి కన్నా ముందు అతని వ్యక్తిత్వం బాగుండాలి.
ఎందుకో నా మనస్థత్వానికి దగ్గరగా వున్నాడని అర్థమైంది. అదీ గాక ఒక చిత్రం చేసివున్నాడు. వెంటనే ప్రొసీడ్ అయ్యాను. ఒకరినొకరం చూసుకోకుండా నెట్ ద్వరా
కలుసుకోవడం యాదృచ్ఛికం.
ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సినిమా నిర్మించి విఫలం కాగానే తిరుగుప్రయాణం అవుతారు. కానీ మీరు మూడు చిత్రాలకు అగ్రిమెంట్
చేసుకోవడానికి కారణం?
ముఖ్యంగా ఇక్కడ ఒక్క విషయం చర్చించుకోవాలి. ఒక్క సినిమా అనే కాకుండా ఏ బిజినెస్ లోనైనా కావాల్సింది ‘నమ్మకం’. ఆ నమ్మకం శ్రీధర్ రెడ్డిపై ఉంది. నేను
డబ్బుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వను. నమ్మకానకే ఎక్కవ విలువనిస్తాను. ఎట్ ఏ టైమ్ వ్యాపారాత్మకంగా ఆలోచిస్తాను. ఏదైనా బిజినెస్ ఒక్కసారే లాభాలు గానీ
నష్టాలుగానీ రావు. కొన్ని రోజులు వేచి చూడాలి. నా వరకు ఒకే చిత్రంలో కోట్లు గడించాలని రాలేదు. నా కున్న ఆస్థులను అమ్ముకోకుండా సేఫ్ జోన్ లో
వుండాలనుకున్నాను. అందుకనే మూడు చిత్రాలు నిర్మించాలనుకున్నాను.
దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి గురించి?
పైన చెప్పినట్లు ఆయన చాలా సింపుల్ వ్యక్తి. అలాగే సిన్సియర్ గా ఆలోచిస్తాడు. నేను వైద్య వృత్తి నుండి వస్తే ఆయన సాప్ట్ వేర్ రంగం నుండి వచ్చి ప్యాషన్ తో
సినిమాలు చేస్తున్నారు. నేను 3 సినిమాలు ఆయనతోనే చేయాలనుకున్నాను. ఒక వేళ శ్రీధర్ గట్టి స్ట్రోక్స్ ఇస్తే (ఫెయిల్యూర్స్) తిరిగి నా వృత్తిని నేను కొనసాగిస్తాను.
(నవ్వుతూ...) కానీ శ్రీధర్ అలా చేయడనే అనుకుంటున్నాను.
‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ కథ విన్నారా?
యా... విన్నాను. టైటిల్ కి తగట్టు ‘ఇట్స్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ’. సినిమాలోని ప్రతి అంశం నచ్చింది.
‘స్నేహగీతం’ తర్వాత ‘శ్రీధర్ రెడ్డి’తో చాలా మంది నిర్మాతలు తీస్తామని ముందుకొచ్చారు. కానీ మీతోనే ఆయన కమిట్ మెంట్ కావడానికి
కారణం?
ఏమో...! అది శ్రీధర్ రెడ్డికే తెలియాలి (నవ్వుతూ...). స్నేహగీతం చూశాను. ఆయన్ని కలిశాను. సినిమా చేయాలని వివరించాను. మా ఇద్దరి అభిప్రాయాలూ
కలవడం వలన ఒప్పుకోవచ్చు. అదీ కాక ఒక నిర్మాతగా నాకు మనీ ప్రాబ్లం లేదు. సబ్జెక్ట్ లో ఇంటర్ ఫియర్ కూడా కానని చెప్పాను.ఎందుకంటే అతని మీద నమ్మకం
అంతే. మమ్మల్ని ఆ డెస్టినీ కలిపిందనుకోవచ్చు.
ఇకపై కంటిన్యూగా చిత్రాలు నిర్మిస్తారా?
మూడు చిత్రాలు పూర్తయ్యాక చూడాలి. ఒక వేళ సక్సెస్ అయితే నా ప్రాక్టీస్ ను సౌతాఫ్రికా నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తాను. లేకుంటే అక్కడే వైద్య వృత్తి కంటిన్యూ
చేస్తాను.
ఇటీవల కాలంలో తెలుగులో మీకు బాగా నచ్చిన సినిమా?
‘గోల్కొండ హైస్కూల్’... ఆ చిత్రం నాకు విపరీతంగా నచ్చింది. ‘హ్యాపీడేస్’ కూడా బాగా నచ్చింది.
సినిమాని ఎప్పుడు విడుదల చేయాలనుకుంటున్నారు?
ఏప్రిల్ 2వ వారంలో సెట్స్ పైకి వెళ్ళి ఆగస్ట్ 19న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము’ అంటూ ముగించారు.