|
|
|
| |
విలక్షణ నటి నందితాదాస్ కు విశిష్ట గౌరవం! |
| సహజత్వానికి కళాత్మకతకూ దగ్గరగా ఉండే సామాజిక చిత్రాల్లో నటిగా మంచి పేరు సంపాయించుకుని, ఇటీవల ’ఫిరాక్’ చిత్రంతో దర్శకురాలైన నందితాదాస్ కు మరో గౌరవం దక్కింది. జాతీయ బాలల సినిమా సొసైటీకి ఆమెను అద్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భగా నందిత గురించిన విశేషాలు.... |
|
ఎంచుకున్న పథంలో రాజీ పడకుండా ముందుకు సాగడం నందిత గొప్పదనం. అదెలా సాధ్యమంటే అంతా నాన్న చలవ అంటుంది. 'నేను చిత్ర సీమలోకి అడుగిడిన రోజుల్లో మా నాన్న ఓ మాటన్నారు. సినిమాలంటే పేరు, డబ్బు, వ్యామోహం. ఆ మాయలో పడితే దారీతెన్నూ మరిచిపోతాం. గమనిస్తావు కదూ అన్న మాటల్ని నేను మరిచిపోలేదు' అని గుర్తు చేసుకుంటారు. నిజమే, అందుకే ఎంత ఎదిగినా ఒదిగే ఉంటుందామె. |
1969లో జన్మించిన నందిత ఢిల్లీలో పెరిగింది. అక్కడే చదివింది. కళాశాల స్థాయిలో ఆరేళ్ల పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంది. మురికి వాడల్లో అభాగ్యులకు సేవలందించింది. నటిగా పేరు ప్రఖ్యాతులు అందుకున్నా మొదట్నుంచి నమ్మిన విలువలను, సిద్ధాంతాలను వదలలేదు. కొన్నేళ్ల క్రితం మతతత్వ హింసకు వ్యతిరేకంగా గళం విప్పింది. ఎయిడ్స్ నివారణ, చైతన్యం కోసం కృషి చేస్తోంది. కొంత కాలంగా విద్య, వర్షపు నీరు నిల్వ ఉంచడం వంటి సామాజిక కార్యక్రమాల్లో కృషి జరుపుతోంది. దర్శకురాలిగా కిందటేడాది ఆమె 'ఫిరాక్' సైతం సామాజిక సమస్యలను ప్రతిబింబించేదే కావడం విశేషం. |
|