నటుడుగా బ్రేక్ ఇస్తానని శంకర్ ఇచ్చిన మాట నిలుపుకున్నారు . నటుడు కావాలనే నా
ఛిరకాల కోరిక ను 'జై బోలో తెలంగాణా'లో విజయవాడ చంటి పాత్ర ద్వారా తీర్చి, నటుడిగా నాకు లైఫ్ ఇచ్చారు....అని చెప్పారు 'జై బోలో తెలంగాణా'లో విజయవాడ చంటి పాత్ర ద్వారా ప్రేక్ష కులు, పరిశ్రమ దృష్టిని ఆకట్టుకున్న వాసు.
గతంలో ఎంత ప్రయత్నించినా ఇంత మంచి పాత్ర దొరకలేదు. శంకర్ ప్రాంతాలకి అతీతంగా నాలోని కళా కారుడిని ప్రోత్సహించారు. 'జై బోలో తెలంగాణా' చూసిన వారంతా ఇటీవల కాలంలో ఎవరినీ తిట్టనంతగా నన్ను తిడుతున్నారు. అంటే నటుడిగా నేను విజయవంతం అయినట్లే. విజయవాడ చంటి పాత్రకన్నా నా నటనకి ఎక్కువ మార్కులు పడ్డాయి. అందుకు కారణం శంకర్. అతని తోడ్పాటు లేకుంటే అంత బాగా చేయలేకపోయేవాడిని. 'జై బోలో తెలంగాణా' ఆర్టిస్ట్ ఎంపిక జరుగు తున్నపుడు మెయిల్ ద్వారా నా వివరాలు పంపాను. నెగిటివే టచ్ తో ఉండే విజయవాడ చంటి పాత్ర ఇచ్చారు. ఇందులో నేను స్వంతం గా డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా, సినిమా ప్రారంభంలో
వ్యాఖ్యానం కూడా చెప్పాను. నా వాయిస్ ని అంతా మెచ్చుకుంటున్నారు. చాలా మంచి
రెస్పాన్స్ వచ్చింది. 'సారీ అంటే కూల్ అయిపోవడానికి చంటిగాడు ఏమన్నా చంటి
పిల్లాడా ?' అనే డయలాగ్ బాగా పండింది.
మాది భీమవరం దగ్గర మహాదేవుపట్నం. చిన్నప్పటి నుండి నటన అంటే పిచ్చి.
అయితే ఇంట్లో వొప్పుకోక పోవడం తో హైదరాబాద్ వచ్చేసాను . ఇక్కడ పరిచయం అయిన
నిర్మాత సి.కళ్యాణ్ నన్ను హీరో రాజశేఖర్ దగ్గర పెట్టారు. ఐదేళ్ళు అక్కడే ఉన్నాను.
'శేషు' సినిమాకి కేషియర్ గా చేసాను. ఆ తర్వాత బెంగళూర్ లో విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకుని
రాజశేఖర్ గారి 'సత్యమేవ జయతే'కు, ఆ తర్వాత అజయ్ భూయాన్ 'హౌస్ ఫుల్'కు
చేసాను. అయితే నటన మీదున్న కోరికతో తిరిగి ఆర్టిస్ట్ అయ్యాను. ఆర్టిస్ట్ గా తొలి చిత్రానికే
ఇంత మంచి పేరు, గుర్తింపు రావడం నా అదృష్టం. అందుకు శంకర్ కు రుణపడి ఉంటాను.
ఈ చిత్రం రెస్పాన్స్ వల్ల ఇప్పుడు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అందులో పెద్ద బ్యానర్లు
ఉన్నాయి. వాటినుండి మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటాను. నటుడిగా వైవిధ్యమున్న
పాత్రలు చేయాలని, మంచి నటుడుగా పేరు సంపాదించాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భం గా
నాకు సినిమారంగంలో చేయుతనిచ్చిన కల్యాణ్, రాజశేఖర్ లకు నా కృతగ్యతలు
చెబుతున్నాను. 'జై బోలో తెలంగాణా' లో నా నటనను బాగా ఇష్టపడ్డ ఎడిటర్ కోటగిరి
అభినందించడం తో పాటు, తెలిసిన వారితో నా గురించి మంచి మాట చెబుతున్నారు. వారికీ
నా కృతగ్యతలు తెలుపుకుంటున్నాను.