సినీన్యూస్
 
 
 
 
 
కీర్తన ధియేటర్ ప్రారంభం
దాదాపు పది సంవత్సరాల క్రితం గాయకుడు పార్థసారథి నెలకొల్పిన ‘కీర్తన రికార్డింగ్ స్టూడియో’ను గణపతి కాంప్లెక్స్ గా గల ఓ భవంతిలో పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పార్థసారథి, రామకృష్ణ, వరుణ్ లు పాల్గొన్నారు. బాలసుబ్రహ్మణ్యం స్టూడియోను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ- ‘దాదాపు పది సంవత్సరాల క్రితం ఇదే స్టూడియోను నేనే వేరేచోట ప్రారంభించాను. దాని తర్వాత పది సంవత్సరాలకు ఈ స్థలంలో ఈ రికార్డింగ్ థియేటర్ ను పునఃప్రారంభించడం ఆనందంగా వుంది. ప్రస్తుతం ఇక్కడ వందల స్టూడియోలు వున్నాయి. అయినప్పటికీ ఏ స్టూడియోలో మంచి నాణ్యత దొరుకుతుందో అక్కడే రికార్డింగ్ చేయించుకోవడానికి వస్తారు. ఈ రికార్డింగ్ స్టూడియో ఇంతకాలం మనగలుగుతుందంటే మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించినందువల్లనే. ఈ రికార్డింగ్ స్టూడియో ప్రారంభం సందర్భంగా నేను అమ్మవారి శ్లోకాన్ని ఆలపించాను’ అన్నారు.