సినీన్యూస్
 
 
 
 
 
'మలబార్ గోల్డ్'తో ఎన్టీఆర్‌
బాలీవుడ్ తారల తరహాలో మన తారలు కూడా ప్రచారకర్తలుగా బిజీ అవుతున్నారు. గతంలో ఒకరు ఇద్దరు మాత్రమే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే ఇటీవలి కాలంలో యువ కథానాయకులు కూడా బిజీ అవుతున్నారు. ఇప్పటికే ‘నవరతన్‌ టాల్కం పౌడర్‌’, ‘జండూబాం’లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న యువ కథానాయకుడు ఎన్టీఆర్‌ తాజాగా ‘మలబార్‌ గోల్డ్‌’ అనే బంగారు ఆభరణాల విక్రయసంస్థకు బ్రాండ్‌ అంబాసడర్‌గా నియమితులయ్యారు. ఈ సంస్థకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా.. డ్రీమ్‌ గర్ల్‌ హేమమాలినితో కలిసి మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరి స్థానంలో ఎన్టీఆర్‌.. ‘మలబార్‌ గోల్డ్‌’కు బ్రాండ్‌ అంబాసడర్‌గా వ్యవహరించనుండడం విశేషం.

ఈ సందర్భంగా గ్రాండ్ కాకతీయలో ‘మలబార్ గోల్డ్’ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అతనితోపాటు ‘మలబార్ గోల్ల్’ రీజనల్ డైరెక్టర్ ఒ.ఆషర్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ- ‘ఈ ‘మలబార్ గోల్డ్’కు ప్రచారకర్తగా పాల్గొనడానికి కేవలం దానిపై వున్న నమ్మకమే. చాలామంది మిత్రులు నువ్వు ఎందుకు పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా చేయవు అని అడిగేవారు. అయితే నాకు నచ్చి, నమ్మకం కుదిరితే చేస్తాను అనేవాడిని. ఇప్పుడు ఆ నమ్మకం కలిగింది. బంగారం వ్యాపారంలో నమ్మకం అనేది ముఖ్యం. మలబార్ వారు వ్యాపారంతో వారు చేస్తున్న సామాజిక సేవ నాకు చ్చింది. ఇదేకాదు ఏ బ్రాండ్ అయినా నమ్మకం వుంటే చేస్తాను అంటూ బంగారం ఆడవాళ్ళు వేసుకున్నా కొనేది మగవాడే కాబట్టి బంగారు ప్రచార కర్తలుగా మగవారినే ఎంచుకుంటున్నారు’ అని అన్నారు. ఈ సందర్భంగా ‘మలబార్ గోల్డ్’ రీజనల్ డైరెక్టర్ ఒ.ఆషర్ తమ సంస్థలో వున్న బంగారు నాణ్యత గురించి తెలిపారు.