సినీన్యూస్
 
 
 
 
 
వైభవంగా పి.పుల్లయ్య శత జయంతి
పద్మశ్రీ పిక్చర్స్ అధినేత, ప్రముఖ నటి శాంతకుమారి భర్త, దర్శక నిర్మాత పి.పుల్లయ్య శత జయంతి ని 'యువకళా వాహిని' హైదరాబాద్ తెలుగు యునివర్సిటీ లో 18న వైభవంగా నిర్వహించింది. కొద్దిమంది అగ్రశ్రేణి సిని దర్శకుల్లో పుల్లయ్య ఒకరు. నిరాడంబరుడు ... అద్భుత ప్రతిభాశాలి. నా జీవితంలో అతనికి గొప్ప స్థానం ఉంది. వేంకటేశ్వరునిఫై రెండు సినిమాలు తీసిన ఘనత అతనికే దక్కింది - అని ఈ సభ లో పాల్గొన్న అక్కినేని నాగేశ్వర్ రావు అన్నారు. ఆ రోజుల్లో బి.యన్.రెడ్డి, కే.వి.రెడ్డి, సి.పుల్లయ్య, పీ.పుల్లయ్య అగ్ర శ్రేణికి చెందిన దర్శకులు. పుల్లయ్య రామా రావుతో కంటే నాగేశ్వర్ రావుతో నే ఎక్కువ సినిమాలు తీసారు. -అని డా. సి.నారాయణ రెడ్డి అన్నారు. పుల్లయ్య చిత్ర పటాన్ని ఆవిష్కరించి పూలమాల వేసారు. పుల్లయ్య కుమార్తె , అల్లుడు పాల్గొన్న ఈ సభ లో పుల్లయ్య సినిమాల్లోని పాటలతో రసవత్తరం గా 'సంగీత విభావరిని చంద్రతేజ, వి.ఏ.లక్ష్మి, వి.వి.రామారావు, పద్మశ్రీ నిర్వహించారు. ఈ సభలో సారిపల్లి కొండలరావు, యం.కాంతారావు, ఓలేటి పార్వతీశం, ముదిగొండ శివప్రసాద్, పరుచూరి హనుమంతరావు, జయ ప్రకాశ రెడ్డి పాల్గొన్నారు. వై.కే.నాగేశ్వర్ రావు నిర్వహించారు.