సినీన్యూస్
 
 
 
 
 
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వెంకట్ కు
ఇండో -నేపాల్ రతన్ అవార్డ్
ఎకనమిక్‌ గ్రోత్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఇంటర్నేషన్‌ అచీవర్స్‌ సమిత్‌ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ అధినేత డా|| వెంకట్‌కు ఇండో నేపాల్‌ ఫ్రెండ్‌షిప్‌ అవార్డ్‌, ఇండో నేపాల్‌ రతన్‌ అవార్డును ప్రదానం చేశారు. 'ది ఎండ్‌' నుంచి ఇప్పటివరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న వెంకట్‌ తన ప్రతి చిత్రం ఆడియో ఫంక్షన్‌ రోజున స్వచ్ఛంద సంస్థలకు, వికలాంగులకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నారు. అంతేకాకుండా ఆపదలో వున్న ఎంతోమంది ఆర్థిక సాయం చేశారు. రహదారి కూడా సరిగాలేని పెదమాంద్యం మండల్‌లోని మారుమూల తండాల్లోని ప్రజలకు కూడా తనవంతు సాయం చేస్తున్నారు డా|| వెంకట్‌. అలాగే చిత్తూరు జిల్లాలోని కెవి పల్లి మండలంలో జంతువుల కోసం నీళ్ళ తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాలను తెలుసుకున్న ఎకనమిక్‌ గ్రోత్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా డా|| వెంకట్‌ను ఖాట్మండు ఆహ్వానించింది. డా|| వెంకట్‌ తరఫున ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ కో-ప్రొడ్యూసర్‌ వి.సురేష్‌రెడ్డి ఈ అవార్డులను అందుకున్నారు. ఇండో నేపాల్‌ ఫ్రెండ్‌షిప్‌ అవార్డును నేపాల్‌ ప్రెసిడెంట్‌ రామ్‌బరన్‌ యాదవ్‌ అందించగా, ఇండో నేపాల్‌ రతన్‌ అవార్డును, డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ మరియు నేపాల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ హెచ్‌.ఇ.భరత్‌మోహన్‌ అధికారి, మినిస్టర్‌ ఆఫ్‌ నేపాల్‌ కె.పి.శర్మ ఓలి చేతులమీదుగా ఇండో నేపాల్‌ రతన్‌ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నేపాల్‌ ఆర్థికాభివృద్ధికి తోడ్పడవలసిందిగా నేపాల్‌ మంత్రివర్గం ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ను కోరింది.