‘బిగ్ బాస్’ విజేత శ్వేతా తివారీ
96 రోజులు.. కదిలినా.. మెదిలినా యావత్‌ భారతదేశం మొత్తం గమనిస్తుంది. ప్రతి అడుగు.. ప్రతి మాట అన్నిటినీ గమనిస్తూనే వుంటుంది. వీటన్నిటినీ దాటుకుని పొందిన ఆనందం.. ఓ చేతిలో కోటి రూపాయలు... ఎదురుగా తన ముద్దుల కూతురు పలక్‌... బిగ్‌ బాగ్‌ సీజన్‌-4 విజేత శ్వేతా తివారీ కళ్లలో కన్నీళ్లు... ‘ఓ ఒంటరి మహిళగా నేను ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానో నాకే తెలుసు...కానీ నేనెప్పుడూ ఒంటరి తల్లిగా ఎవరి నుండి సానుభూతి ఆశించలేదు. నాకు నేనుగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఈ బహుమతి మొత్తం నా కూతురు పలక్‌ ఉన్నత చదువు కోసమే’అని శ్వేత ఉద్విగ్నంగా చెప్పిన మాటలు...

స్టార్‌ ప్లస్‌ ఛానల్‌ బుల్లి తెర మహారాణిగా వెలు గొందుతున్న నటి శ్వేతా తివారీ.. ఇండియన్‌ టెలివిజన్‌ షో బిగ్‌ బాస్‌ సీజన్‌ - 4లో విజేతగా నిలిచి కోటి రూపాయల బహుమతిని సొంతం చేసుకుంది. మూడు నెలలపాటు హౌస్‌లో వున్న అనంతరం ఎంతో ఉత్కంఠగా సాగిన క్షణాలు.. నిర్ణేతగా సల్మాన్‌ ఖాన్‌...విజేతను ప్రకటించే సమయం... ఒక్కసారిగా శ్వేత చేయిని పైకి ఎత్తి విజేతగా ప్రకటించారు..‘ఓ కలలా అనిపిస్తోం ది. ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు’ అని శ్వేత ఓ క్షణం అలా నిలుచుండి పోయింది. ఈ విజయం కోసం శ్వేత చివరిగా డబ్ల్యుడ బ్ల్యుఇ రెజ్లర్‌ కలీ, అస్మిత్‌ పటేల్‌, డాలీ బింద్రాలనుండి పోటీ ని ఎదుర్కొని విజయా న్ని సాధించింది.

జాలి దయ కోసం కాదు..
‘నేను ఒంటరి తల్లిని అని ఎవరి సానుభూ తిని అర్థించలేదు. కష్ట పడి పనిచేసే మనస్త త్వం నాది.మొదట ఎలా వున్నానో అలాగే వున్నాను. అభిమానులు వారికి నచ్చి ఇచ్చిన విజయమే కానీ దేని కోసం ఎవరినీ అడగలేదు’ అని శ్వేత చెబుతోంది.

బాల్యం... విద్య...
అక్టోబర్‌ 4, 1980లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ ఘర్‌లో శ్వేతాతివారీ పుట్టింది. తల్లిద్రండులు నిర్మ, అశోక్‌తివారీ. విద్యాభ్యాసం ముంబయి లోనే. మేజ్‌గాన్‌ బర్హానీస్‌ కాలేజ్‌ నుండి గ్యాడ్యు యేట్‌ పట్టా పొందింది. ఒక తమ్ముడు నిదాన్‌.

సాధారణ గృహిణి నుండి..
1998లో 18 ఏళ్ళ వయసులో నటుడు రా జాచౌదరీని వివాహం చేసుకుంది. కోడలిగా తన బాధ్యతలలో మునిగిపో యి వున్న సమయంలో ఓ దర్శకుడి ద్వారా ఆమె కు స్టార్‌ ప్లస్‌ సీరియల్‌ లో నటించే అవకాశం వచ్చింది. 1999లో ‘క సౌటీ జిందగీ కే’ సీరియ ల్‌ ద్వారా కెరియర్‌ని ప్రా రంభించింది.

అన్నిటిలోనూ ముందే...
ఒక సీరియల్‌ ద్వారా పరిచయం అయిన శ్వేత వేలాదిగా అభిమానుల ను పొందింది. డాన్స్‌ షోలు, టెలివిజన్‌ సీరియళ్లలో ఆమె నటిం చింది. ఆనేవాలా పల్‌, కరమ్‌, కహీ కిసీ రోజ్‌, క్యా హద్‌సా క్యా హకీఖత్‌, రిస్తే, డాడీ సంజాక రో, దోస్త్‌, యాత్రా, నాగిన్‌, అజీబ్‌ వంటి సీరియ ళ్లలో నటించింది.ఇప్పటి వరకుఆమె తొమ్మిది సినిమాల్లో నటించింది. 25కు పైగా సీరియళ్లలో నటించింది. రియాలిటీ షోలలో పాల్గొంటోంది.

ఎంతో గొప్పగా...
‘జనవరి 8, 2011 నా జీవితంలో మరచిపోలేని రోజు’ అని శ్వేత చెబుతోంది. ఎందుకంటే బిగ్‌ బాస్‌ విజేతగా నిలిచిన రోజు అదే.

ఆత్మవిశ్వాసమే నా బలం..
గత సంవత్సరం శ్వేత భర్త నుండి విడాకులు తీసుకుంది. వీరికి పలక్‌ అనే 12 ఏళ్ల పాప కూ డా వుంది. కానీ ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. ఒంటరిగా తన కూతురిని పెంచడంలో నిమగ్న మైపోయింది.‘హౌస్‌లో డాలీతో గొడవ జరిగిన ప్పుడు వెంటనే వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ తిరిగి ఆలోచించాను. నా తప్పు లేనప్పుడు నేనెందుకు వెళ్లాలి. ఇలా వెళ్ళిపోవడం కరెక్టు కూడా కాదు. అప్పుడే నిర్ణయించుకున్నా వెను డుగు వేయొద్దు. విజయం కోసం ప్రయత్నిం చాలి అనుకున్నాను’ అంటున్న శ్వేత బిగ్‌ బాస్‌ విజేతగా నిలిచింది.