చలన ఔత్సాహికులు తప్పక చదవాల్సిన పుస్తకాల్లో ఒకటిగా "Our Films, Their Films"ని పేర్కొంటారు. భారతదేశం గర్వించదగ్గ సినిమా దర్శకుల్లో
ఒకరైన సత్యజిత్రే అప్పటి సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా మన సినిమాకి ఒక పరిభాషని ఏర్పరచి, ముందుతరాలలో
ఎందరికో దిశానిర్దేశం చేసిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడు దార్శనికుడు వ్రాసిన "Our Films, Their Films" అనే పుస్తకాన్ని తెలుగులో
‘‘సినిమాలు : మనవీ, వాళ్ళవీ’’ అనే పేరుతో మీముందుకి తెచ్చే ప్రయత్నం చేసింది నవతరంగం. మొదటి పుస్తకాన్ని డి.సురేష్ బాబు
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినిమా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ డిన్ వెంకటేష్ చక్రవర్తి
పాల్గొన్నారు.
ఈ పుస్తకావిష్కరణ సభలో భారతదేశంలోనే తొలిసారిగా ‘‘ఓపెన్ సోర్స్ సినిమా’’ స్క్రీనింగ్ కూడా జరిగింది. ఈ స్క్రీనింగ్ లో భాగంగా ప్రపంచ
యావత్తూ సంచలనం సృష్టించిన మూడు ఓపెన్ సోర్స్ సినిమాలను ప్రదర్శించారు. సింటెల్, బిగ్ బక్ బన్నీ, ఎలిఫెంట్ డ్రీం - అనే ఓపెన్ సోర్స్
సినిమాల ప్రదర్శన అనంతరం జాతీయ అవార్డు పొందిన ‘పోస్ట్ మ్యాన్’’, ‘‘అద్వైతం’’ అనే లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ మధ్యన
రామానాయుడు స్టూడియోస్ లో నిర్మితమైన స్పిరిట్ డిజిటల్ ప్లేయర్ అత్యద్భుతమైన వీడియో మరియు ఆడియో క్వాలిటీతో ప్రదర్శించిన ఓపెన్
సోర్స్ సినిమాలు ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. |