కల్చరల్
 
 
 
 
జాలాదికి సినీ గీతాల నీరాజనం
సినీ కవితా రంగా ల్లో ఎన్నో ప్రయోగాలు చేసిన జాలాది ప్రయోగాల నిధి- అని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి కొనియాడా రు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో మంగళవారం జరిగిన 'జానపద నది- జాలాదికి సినీ గీతాల నీ రాజనం' కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జాలాది జానపద శైలిలో రచించిన' పుణ్యభూమి నాదేశం' గీతాన్ని చూస్తే తన రచన శైలి అర్థమవుతుందన్నా రు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ- జాలాది తన గురువుతో సమానమన్నారు. విజయవాడలో జాలాది విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాలాది కూతురు డాక్టర్ విజయ, ప్రము ఖ దర్శకులు పి.చంద్రశేఖర్‌రెడ్డి, ముత్యాలసుబ్బయ్య, సినీ రచయిత సీఎస్‌రావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు, కళా పోషకులు లయన్ పి.జయప్రకాష్‌రెడ్డి, యువకళావాహినీ స్థాపక అధ్యక్షుడు వై.కె.నాగేశ్వరరావు, లంక లక్ష్మినారాయణ , జి.మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు. వి. వి. రామారావు, పద్మశ్రీ జాలాది పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు.