వకళలు ప్రజలకు మేలుకొలుపు కావాలి. కళలు, కళాకారులను పోషించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఏ కళ
అయినా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఉండాలి -అని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అన్నారు. ప్రముఖ సాంస్కృతిక
సంస్థ 'యువ కళా వాహిని' నిర్వహణలోఅమెరికాలో ఉండే మధుర గాయని మణిశాస్త్రి త్రిగళంతో పాడిన భానుమతి, లతా
మంగేష్కర్ , సుశీల సంగీత విభావరి ముగింపుసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముగ్గురు ప్రముఖ గాయనీమణుల
పాటలను అద్భుతం గా గానం చేసిన మణిశాస్త్రిని అభినందించారు. ఈ కార్యక్రమం లో వస్తుశిల్పి బబి.యన్.రెడ్డి, జాగృతి విద్య
సంస్థల అధిపతి ఓ .శ్రీనివాస రెడ్డి, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరు హనుమంత రావు, సంగీత దర్శకులు మాధవ పెద్ది
సురేష్, గాయకులూ చంద్ర తేజ , సురేఖ మూర్తి, యువకళా వాహిని వై.కే.నాగేశ్వరరావు, లంక లక్ష్మి నారాయణ ,
మల్లికార్జునరావు పాల్గొన్నారు. |