Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
సిద్ధార్థ ‘180’
     జయేంద్ర దర్శకత్వంలో సిద్ధార్థ్‌, నిత్యమీనన్‌, ప్రియా ఆనంద్‌ ముఖ్య తారలుగా '180' చిత్రం రూపొందుతోంది. సత్యం సినిమా సమర్పణలో ఎస్‌పీఐ సినిమాస్‌ ప్రై.లి, ఆఘాల్‌ ఫిలింస్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం విశేషాలను హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. "జయేంద్రన్‌ నాకు గాడ్‌ఫాదర్‌ లాంటివాడు. నేను ఈ రోజు ఇంతటి ఉన్నతస్థితిలో వున్నానంటే అందుకు ఆయనే కారణం. సినిమాల్లోకి రావాలన్న నా ఆలోచనకు స్ఫూర్తి జయేంద్రే. నా చిన్నతనంలో నా చేత 'బానిష్‌' అనే మస్కిటోకాయిల్‌ యాడ్‌కు 8 భాషల్లో డబ్బింగ్‌ చెప్పించారాయన.

నా తొలి పారితోషికంగా రూ.300లు. ఇచ్చింది కూడా తనే. దాదాపు ఐదు వందల వాణిజ్య ప్రకటనలు చేసిన జయేంద్రగారి తొలి చిత్రంలో నేను నటిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. తెలుగు నటుడిగా నేను ఈ చిత్రంతో తమిళంలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. సాంకేతికపరంగా అత్యుత్తమ చిత్రమవుతుంది. హాలీవుడ్‌ సినిమాను చూసిన ఫీల్‌ కలుగుతుంది. ఈ ఏడాది ఆఖరుకి నేను నటిస్తున్న 'బావ' చిత్రం విడుదలవుతుంది. సంక్రాంతికి ప్రకాష్‌ కోవెలమూడి సినిమా వస్తుంది.

వచ్చే వేసవిలో '180' విడుదలవుతుంది' అన్నారు. దర్శకుడు జయేంద్ర మాట్లాడుతూ -"ఇది రొమాంటిక్‌ చిత్రం. సిటీ నేపథ్యంలో కొనసాగే అందమైన ప్రేమ కథ ఇది. శరత్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆరు పాటలుంటాయి' అని తెలిపారు. నిర్మాత కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ -"హైదరాబాద్‌, అమెరికాలో, మలేసియాల్లో చిత్రీకరణ జరుగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రెండు భాషల్లోనూ 180 టైటిల్‌నే నిర్ణయించాం' అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో నిత్యమీనన్‌, ప్రియా ఆనంద్‌, బాలసుబ్రమణియమ్‌, ఉమర్జీ అనురాధ, గీత, సురేష్‌, బాలా కూడా పాల్గొన్నారు. మౌళి, గీత, రవిప్రకాష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: సెల్వ, ఎడిటర్‌: కిషోర్‌, పాటలు: వనమాలి (తెలుగు), కథ-స్క్రీన్‌ప్లే: శుభ, జయేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు : సురేష్‌ బాలాజి, జార్జ్‌ పయస్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com