"ఈ చిత్రాన్ని 70 సెంటర్లలో విడుదల చేశాం. అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నవరసాల సమ్మేళనంతో సినిమా
బాగుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని రాజీపడకుండా తీశాను. నా భార్య మణిమౌళి కాస్ట్యూమర్‌గా వ్యవహరించడంవల్ల ఖర్చు
కొంత మేర తగ్గింది. ఈ చిత్రంలో నటించినందుకు జయసుధగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను' అన్నారు దినేష్‌కుమార్.
శరత్‌కుమార్, నమిత, ఫర్జానా, జయసుధ కాంబినేషన్‌లో ఆయన దర్శకత్వంలో రూపొందిన '1977' ఇటీవల విడుదలైంది. ఈ
చిత్రవిజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దినేష్‌కుమార్ పై విధంగా స్పందించారు. ఈ
చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన రాజ్ మాట్లాడుతూ -"పాటలకు ట్యూన్స్ ఇవ్వమంటే ఇస్తాను కానీ ఫైట్స్ చేయలేను... అని ఈ
చిత్రంలో విలన్‌గా నటించమని దర్శకుడు అడిగినప్పుడు అన్నాను.
ఇంత మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది' అన్నారు. "ఈ చిత్రంలో ఒక శరత్‌కుమార్‌కు భార్యగా... మరో శరత్‌కుమార్‌కు
అమ్మగా నటించాను. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేశాను' అని జయసుధ అన్నారు.