కౌశిక్ టైటిల్ పాత్రధారిగా; శ్రీహరి, సుమన్, సాయికుమార్, జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందనున్న 'శ్రీ జగద్గురు ఆదిశంకర' చిత్రం షూటింగ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో
ప్రారంభమైంది. జె.కె. భారవి దర్శకుడు. నారా జయశ్రీదేవి నిర్మాణ సారథ్యం వహించే ఈ చిత్రాన్ని గ్లోబల్ పీస్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తోంది. తొలి సన్నివేశానికి హీరో నాగార్జున
క్లాప్‌నివ్వగా, పుష్పగిరి పీఠాధిపతి, శారదా పీఠాధిపతి సంయుక్తంగా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు భారవి మాట్లాడుతూ "శ్రీహరి, వాళ్లబ్బాయి మేఘాంశ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంతవరకు చేయనటువంటి పాత్ర శ్రీహరిది. చిత్రంలో 16 పాటలున్నాయి.
నాగ్ శ్రీవత్స అద్భుతంగా బాణీలు కట్టారు. కేరళ, కాశీ, ప్రయాగ, మధుర, తిరుపతి వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపుతాం.
బాల నటుడి నుంచి మలయాళంలో హీరోగా ఎదిగి ఎంతో పేరు తెచ్చుకున్న కౌశిక్ ఈ చిత్రంలో శంకరాచార్య పాత్ర చేస్తున్నారు'' అని చెప్పారు. ఈ చిత్రంలో నటించడాన్ని అదృష్టంగా
భావిస్తున్నానని శ్రీహరి చెప్పారు. ఈ చిత్రానికి అత్యున్నత విలువలతో కూడిన సంగీతం సమకూడిందని గేయ రచయిత వేదవ్యాస అన్నారు. పీఠాధిపతులు, బ్రహ్మకుమారి సునీత ఈ చిత్రం
విజయవంతం కావాలని ఆశీర్వదించారు.
అలీ, మురళీమోహన్, శ్రీధర్, వాసు, గిరీశ్ కర్నాడ్, ప్రకాశ్‌రాజ్, తనికెళ్ల భరణి, మీనా, జయప్రద, కోవై సరళ, వినయ ప్రసాద్, శివపార్వతి, హేమ, సుధ,
మంజుభార్గవి, శరత్‌బాబు, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీస్, ఎల్బీ శ్రీరాం, వేణుమాధవ్, జయప్రకాశ్‌రెడ్డి.
ఆశిష్ విద్యార్థి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, అశోక్‌కుమార్, మాస్టర్ వంశీ, మాస్టర్ తేజ, బేబి హరిత, బేబి సౌమ్య తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: ఆది శంకరాచార్య,
వేదవ్యాస, జె.కె.భారవి, ఛాయాగ్రహణం: పి.కె.హచ్.దాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: ఉదయభాస్కర్, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జె.కె.భారవి.
|